ఈమధ్యే భారత్ తరుపున పొట్టి ఫార్మాట్ లో అరంగ్రేటం చేసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు.టి20 వరల్డ్ కప్ ఫైనల్ టీమ్ లోకి సెలెక్ట్ అయిన ఇషాన్ ఫామ్ కోల్పోవడంతో అతనిపై విమర్శలు వచ్చాయి.అయితే తాజాగా వాటిని పటాపంచలు చేస్తూ రాజస్తాన్ వర్సెస్ ముంబై మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్ లో ఇషాన్ 25 బంతుల్లో 50 పరుగులు చేసి 200 స్ట్రైక్ రేట్ ను మెయిన్ టైన్ చేస్తూ మ్యాచ్ ను 8.2 ఓవర్ లలోనే ముగించేసాడు.ఈ మ్యాచ్ లో ఇషాన్ మొత్తం 5ఫోర్లు,3సిక్స్ లు బాది ముంబై ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచాడు.ఫామ్ లో లేని ఇషాన్ ఒక్కసారిగా ఫామ్ లోకి రావడంతో క్రికెట్ అభిమానులు ముంబై తదుపరి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.