S S Thaman : ఇటీవల కాలంలో టాలీవుడ్ మ్యూజిక్ ప్రపంచాన్ని ఏలుతున్న ఏకైక వ్యక్తి ఎస్ ఎస్ థమన్. ఈయన మ్యూజిక్ సెన్షేషన్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు అందరు హీరోల అభిమానుల్లో కాస్త భయం, టెన్షన్ మొదలవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో అంటే కిక్, మిరపకాయ్ సినిమా సమయంలో అదరగొట్టిన థమన్ ఆ తరువాత బ్యాక్ అయిపోయారు. రొటీన్ ట్యూన్స్, డప్పుల మోత ఏంటిరా బాబోయ్ అనుకున్నారో ఏమో కానీ ప్రేక్షకులకు సైతం ఆయన సంగీతం బోర్ కొట్టేసింది. మళ్లీ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఫామ్‌లోకి వచ్చేశారు.
ఇక హీరోలు చూస్తే దాదాపు ప్రతి ఒక్కరూ థమన్‌కే ఓటేస్తున్నారు. మరి ఇన్ని సినిమాలు ఒప్పుకుంటే మ్యూజిక్ ఇవ్వడం అనేది తలకు మించిన భారం అవుతుంది కదా. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో సినిమాలో మ్యూజిక్‌కు ఎక్కడ దెబ్బ పడుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు థమన్‌కు కాపీ క్యాట్ అనే పేరు ఎలాగూ ఉంది. ఎక్కడ కాపీ కొట్టి తమ హీరో సినిమాకో తగిలిస్తాడో అని అభిమానులు భయపడుతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని అందరూ చెప్పుకున్నారు. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో, క్రాక్, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, అఖండ వంటి చిత్రాలే.
S S Thaman : థమన్‌ను ఒక ఆట ఆడేసుకున్న నెటిజన్స్
అయితే ఇప్పుడు థమన్ చేతిలో ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 10 ప్రాజెక్టులు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ – త్రివిక్రమ్ మూవీ, విజయ్ వారసుడు, రామ్ చరణ్- శంకర్‌ల మూవీ..ఇలా పెద్ద ప్రాజెక్ట్సే ఉన్నాయి. మరి వీటన్నింటికీ ఒకేసారి సంగీతం అందించాలంటే మాటలా. అందుకే ఎక్కడి నుంచి కాపీ కొడతాడోనని హీరోల అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇటీవల చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా టీజర్ రిలీజైంది. దీనికి థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం మీద థమన్‌ను ఒక ఆట ఆడేసుకున్నారు. దానికి అసలైన ట్యూన్‌తో థమన్ ట్యూన్‌ని కంపేర్ చేసి మరీ ట్రోల్ చేశారు. ఇలా ఒక్కసారిగా అన్ని ప్రాజెక్ట్స్‌ను ఒప్పుకుని ఇబ్బంది పడే కంటే సెలక్టివ్‌గా సినిమాలు ఎంపిక చేసుకోవచ్చుగా అని సలహా ఇస్తున్నారు. మరి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే థమన్‌కి ఈ సలహాలు తలెకెక్కుతాయో లేదో చూడాలి.