Bigg Boss 6: బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ రద్దయిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ ఇచ్చిన ‘సెలెబ్రెటీ గేమింగ్ లీగ్’ టాస్క్‌ని కొందరు కంటెస్టెంట్స్ అస్సలు ఆడలేదు. ఒక ఐదుగురు అయితే కనిపించను కూడా కనిపించలేదు. కాస్ట్యూమ్స్ వేసుకుని సైడ్‌కి కూర్చుండిపోయారు. దీంతో బిగ్‌బాస్ అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఫుల్‌గా క్లాస్ పీకారు. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలాంటి చెత్త ఆటను చూడలేదని.. ప్రేక్షకులు సైతం ఇదే భావిస్తున్నారని నేరుగా చెప్పేశారు. ఆడటం ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని చెప్పారు.
టాస్క్‌ని క్యాన్సిల్ చేసి ఈ వారానికి బిగ్‌బాస్ హౌస్‌కి నో కెప్టెన్ అని తేల్చి చెప్పారు. కాస్ట్యూమ్స్ తీసి స్టోర్ రూంలో పెట్టేయాలని కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ ఆదేశించాడు. అయితే ఈ టాస్క్ రద్దుకు కారణం శ్రీసత్య అని టాక్ నడుస్తోంది. అర్జున్‌ని రెచ్చగొట్టి మరీ రేవంత్‌తో గొడవకు దిపింది. ఆ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇరు టీం సభ్యులకు ఓ ఛాలెంజ్ ఇచ్చాడు. అదే వాల్ పోస్టర్. రెండు టీమ్‌లకు చెందిన సభ్యులు వాల్ పోస్టర్లను అతికించారు. మధ్యలో అర్జున్‌ని రేవంత్ అరేయ్ పప్పు అన్నాడు. నిజానికి ఈ విషయాన్ని అర్జున్ లైట్ తీసుకున్నాడు.
కానీ శ్రీ సత్య ‘నిన్ను ఏమైనా అంటే రియాక్ట్ అవ్వవా, మనిషివి కావా’ అంటూ రెచ్చగొట్టింది. ఇంకేముంది అర్జున్ రెచ్చిపోయాడు. దీంతో వాళ్లిద్దరూ టాస్క్ విషయం మరిచారు. అసలే రేవంత్‌పై బాగా కోపంతో ఉన్న అర్జున్.. కోపంతో ఊగిపోయాడు. పాత్రల్లో నుంచి బయటకు వచ్చి గొడవపడ్డారు. ఇక ఆ తరువాత ఎవరి దారి వారిదై పోయింది. అసలే అమ్మడు టాస్క్ ఆడింది లేదు పెట్టింది లేదు. అస్సలు టాస్క్ ఆడలేదని బిగ్‌బాస్ ఐదుగురిలో శ్రీసత్య కూడా ఉంది. పైగా టాస్క్ ఆడుతున్న వారిని కూడా చెడగొట్టేసింది.