Samantha : సమంత ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆమె అనారోగ్యంపై వస్తున్న వదంతులను నిజం చేస్తూ నిన్న ఇన్‌స్టా వేదికగా తన అనారోగ్యం గురించి వెల్లడించి సామ్ షాక్ ఇచ్చింది. తన ఆరోగ్యం కుదుటపడ్డాక విషయం చెబుదామనుకున్నానని కానీ ఇంకా టైమ్ పట్టే అవకాశం ఉండటంతో ఇక చెప్పేశానని చెప్పుకొచ్చింది. సామ్ పోస్ట్ చూసి ఆమె అభిమానులతో పాటు సినీతారలంతా షాక్‌కి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ ధైర్యం చెప్పారు.’గెట్ వెల్ సూన్ సామ్’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
కాగా.. తాజాగా ఆమె ముఖం మారిపోయిందంటూ కామెంట్స్ వినవస్తున్నాయి. ఒక యాడ్‌లో ఆమె ముఖం చాలా మారినట్టుగా కనిపించింది. దీంతో పలు వెబ్‌సైట్స్‌లో కూడా ఈ విషయమై వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సామ్ తన వ్యాధి గురించి వెల్లడించడంతో ఈ వ్యాధి కారణంగానే సామ్ ముఖం అలా తయారైందనే వాదన తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో సామ్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ రకమైన చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది. సోషల్ మీడియాలో తనపై వచ్చే వదంతుల కారణంగానే అని తొలుత అంతా భావించారు.
కానీ సామ్ బయట కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అప్పటికే రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఓ యాడ్‌లో సామ్ ముఖం ఉబ్బిపోయి అసలు కనుక్కోలేకుండా అయిపోయింది. దీంతో ఆమె సర్జరీ చేయించుకుందనే వాదన బలంగా వినిపించింది. ఇప్పుడు సామ్ పోస్ట్ తర్వాత సర్జరీ లాంటివేమీ చేయించుకోలేదని.. కేవలం వ్యాధి కారణంగానే ఆమె ముఖం అలా తయారైందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అయితే సామ్ తను పెట్టిన పోస్టులో కూడా తన ఫేస్ కనబడనివ్వలేదు. దీంతో వ్యాధి కారణంగానే ఆమె ముఖం అలా తయారై ఉంటుందని అందుకే తన పోస్టులో ముఖం చూపించలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.