మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మరో పెళ్లీ పెటాకులైనట్లేనా? ఇన్నాళ్లూ పుకార్లుగానే ఉన్న ఆమె విడాకుల వార్తలు తాజాగా ఆమె భర్త కల్యాణ్ దేవ్ పోస్టుతో ఖాయమైందా? దీనిపై శ్రీజ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా.. ఫాదర్స్ డే సందర్భంగా కల్యాణ్ దేవ్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

ఇందులో అతడు తమ విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. తన కూతురు నవీక్షతో వారానికి నాలుగు గంటల సమయం మాత్రమే గడిపే అవకాశం ఉందని కల్యాణ్ చెప్పడం చూస్తే శ్రీజతో విడాకులు అధికారికంగానే జరిగినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదివారం (జూన్ 18) ఫాదర్స్ డే సందర్భంగా కల్యాణ్ ఓ వీడియో పోస్ట్ చేశాడు.
అందులో కూతురు నవీక్షతో అతడు ఉన్నాడు. ఆ వీడియోలో తాను తన తండ్రితో మరింత సమయం గడపాలని అనుకుంటున్నట్లు ఆ పాప చెప్పడం వినిపిస్తుంది. ప్రతి వారం నేను గడిపే అత్యుత్తమమైన నాలుగు గంటలు ఇవే అంటూ కల్యాణ్ ఆ పోస్ట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే వీళ్లు విడిపోయినట్లే అని అనుకుంటున్నారు. కల్యాణ్ పడుతున్న బాధేంటో తామూ అర్థం చేసుకోగలమని మరికొందరు కామెంట్ చేశారు.