ఈసారి రెండు భాగాలుగా జరిగిన ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్స్ గా నిలిచారు.అయితే ఈ సీజన్ ఐపిఎల్ లో ప్రతి ఫ్రాంచైజ్ నుండి బిగ్గెస్ట్ సిక్స్ లు బాదింది ఎవరో వాళ్ళు ఎన్ని మీటర్స్ బాదరో ఇప్పుడు చూద్దాం.
ఈసారి ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ నుండి ఆ టీమ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 108 మీటర్స్ సిక్స్ కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు.ఆతర్వాత స్థానంలో ముంబై ఇండియన్స్ నుండి 105 మీటర్స్ సిక్స్ బాదిన పొలార్డ్ నిలిచాడు.పంజాబ్ నుండి ఓపెనర్ కే.ఎల్ రాహుల్ 101 సెంటీమీటర్స్ సిక్స్ కొట్టి మూడవ స్థానంలో నిలవగా, ఆర్.సి.బి నుండి మ్యాక్స్ వెల్ 100 మీటర్స్ సిక్స్ కొట్టి నాలుగవ స్థానంలో నిలిచాడు రాజస్థాన్ నుండి దూబె,లివింగ్ స్టోన్ 97 మీటర్స్ సిక్స్ కొట్టి తర్వాత స్థానంలో ఉన్నారు.ఆతర్వాత స్థానంలో హైదరాబాద్ నుండి 96 మీటర్స్ సిక్స్ కొట్టిన నబీ,మనీష్ పాండే నిలిచారు.
95 మీటర్స్ సిక్స్ కొట్టి ఢిల్లీ నుండి శ్రేయాస్,94 మీటర్స్ సిక్స్ కొట్టి కొల్కత్తా నుండి నితీష్ రాణా తర్వాతి స్థానాల్లో నిలిచారు.