Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ సెప్టెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో మందు తాగుతున్న సామ్రాట్ వద్దకు బాబాయి వచ్చి పట్టలేని సంతోషం, లేదా భరించలేని బాధ ఉంటే తప్ప నువ్వు మందు తాగవు కారణం ఏంది అని ప్రశ్నిస్తాడు. అందుకు సామ్రాట్ రేపు తులసి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. హనీ ని చూసుకోవడానికి దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడమంటాడు.
తర్వాత సన్నివేశంలో లాస్య, నందులు సామ్రాట్ ఇంటికి వచ్చి హనికి బాగు అయ్యేవరకు ఇక్కడే ఉండి చూసుకుంటామని చెబుతూ ఉండగా ఇంతలో తులసి వాళ్ళు వస్తారు. సామ్రాట్, తులసికు థాంక్స్ చెబుతూ మీరంతా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే దానికి అనసూయ భర్త విడాకులు ఇచ్చిన కూడా అత్తమామలను జాగ్రత్తగా చూసుకుంటుంది అది మాకు తులసి గొప్పదనం అంటే తులసి ఆపే ప్రయత్నం చేయగా అనసూయ కొందరు ఏం చేయకుండా గొప్పలు చెప్పుకుంటారు నేను జరిగిందే కదా అమ్మ చెప్తున్నా అంటూ అందరూ హనీ వద్దకు వెళ్తారు. అందరిని చూసి హనీ చాలా సంతోషిస్తుంది తర్వాత అందరూ నీకు నయం అయ్యే వరకు ఇక్కడే ఉంటామంటే ఎగిరి గంతులు వేస్తుంది.
తరువాత సన్నివేశంలో నందు, తులసితో తక్షణమే నా వాళ్లను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. దానికి తులసి ఏ హక్కుతో వెళ్ళమంటున్నారు నేను మీకు ఆల్రెడీ విడాకులు ఇచ్చేశాను ప్రతిదానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెబుతుంది. అప్పుడు నందు నా కుటుంబ సభ్యులను నీ చేతిలో కీలుబొమ్మలను చేసుకొని ఆడుకుంటున్నావు. వాళ్లంతా నీ మాయలో ఉన్నారు అంటాడు నందు. దానికి తులసి మీరు కూడా లాస్య మాయలో పడి విడాకులు కంటే ముందే లాస్యను మన బెడ్ రూమ్ వరకు తీసుకొచ్చారు అప్పుడు భార్యకు సంజాయితి చెప్పాలి అని అనిపించలేదా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
తర్వాత సన్నివేశంలో అభి, అంకితతో మనం వచ్చిన పనేంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అందరూ సామ్రాట్ గారి కూతురిని మహారాణి లాగా నెత్తిన పెట్టుకోవాలా, సామ్రాట్ గారూ మమ్మీ కు బిజినెస్ పార్టనర్ మాత్రమే ఇక్కడ మాత్రం వేరేలా జరుగుతుంది అంటే నువ్వు ప్రతిదీ నెగటివ్గా ఆలోచిస్తావు కాస్త పాజిటివ్గా కూడా ఆలోచించు అభి అంటూ అక్కడి నుండి అంకిత వెళ్ళిపోతుంది.
Intinti Gruhalakshmi:
తరువాత సన్నివేశంలో సామ్రాట్, నందు, లాస్యలు బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, మరొకవైపు అందరూ క్యారమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూస్తున్న సామ్రాట్ ఎంతో సంతోషిస్తాడు. తర్వాత హనీ కూడా సామ్రాట్ ను గేమ్ ఆడడానికి పిలుస్తుంది. కాసేపు అయ్యాక వస్తానని అంటాడు సామ్రాట్. లాస్యతో సామ్రాట్ మీ లక్కీ పక్కన ఉంటే మా హనీ చాలా యాక్టివ్ గా ఉంటుంది మీరంతా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషం అని అంటాడు సామ్రాట్. అప్పుడు లాస్య మా లక్కీ ఎక్కడ ఉంటే అక్కడ అందరూ సంతోషంగా, గా ఉంటారు అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.