Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన కాళ్లపై తాను బ్రతకడానికి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఆ విషయాన్ని తన తల్లికి చెబుతుంది. ఈ ఇంట్లో ఉంటే అనవసరమైన పోరాటం చేయవలసి వస్తుంది అని.. దానివల్ల నేను అనుకున్న స్థానానికి వెళ్లలేను అని.. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. దాంతో దీపక్ ఒంటరిగా ఉంటావా అని బాధగా అడుగుతాడు.
వెంటనే తులసి వాళ్ళ తల్లి తను ఎప్పుడు ఒంటరిది కాదు అని ధైర్యం ఇస్తుంది. అప్పుడే ప్రేమ్ నేను నీకు తోడుగా ఉంటాను అని నీ బాధ్యతలు మోయటానికి ఉంటాను అని అంటాడు. ఇక ఆఫీసులో క్వార్టర్స్ ఉన్నాయి అక్కడ ఉండమని సామ్రాట్ అనటంతో.. లేదు నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను అంటుంది తులసి.
ఆ తర్వాత సామ్రాట్ మీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని మాట ఇస్తాడు. ఇక ప్రేమ్ కూడా తులసిని ఎంకరేజ్ చేస్తాడు. మరోవైపు ఇంట్లో అందరూ మౌనంగా భోజనానికి కూర్చుంటారు. వెంటనే నందు అందరూ ఇలా ఎందుకు ఉన్నారు అని వారిపై విరుచుకుపడతాడు. ఇక లాస్య కూడా మధ్యలో కలగా చేసుకొని అవును తన సుఖం తను చూసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటుంది.
దాంతో అందరూ అక్కడి నుంచి భోజనం చేయకుండా వెళ్తారు. వెంటనే దివ్య అందరిపై అరుస్తుంది. తాతయ్యని బ్రతిమాలి భోజనం చేయిస్తే మీరు భోజనాల దగ్గర నుండి వెళ్లిపోయేలా చేశారు అని అంటుంది. ఇక అభి కూడా కాస్త కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్తాడు. మరో వైపు తులసి ఇంట్లో వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడే తన తల్లి రాగ తన తల్లితో తన కష్టసుఖాలు గురించి మాట్లాడుకుంటుంది. ఇక దివ్య తల్లి గురించి ఆలోచిస్తూ తల్లికి ఫోన్ చేయాలని అనుకుంటుంది. అప్పుడే లాస్య ఆపే ప్రయత్నం చేయటంతో దివ్య లాస్య పై అరుస్తుంది. ఇక అనసూయ నాకు హక్కు ఉంటుంది.. ఎవరి తులసికి ఫోన్ చేయకూడదు అని గట్టిగా చెబుతుంది.
ఇక తులసి గురించి నెగటివ్ గా మాట్లాడుతుంది అనసూయ. దివ్య మీరు మా అమ్మ ను ఇంట్లో నుంచి పంపించారు కానీ మా మనసులో నుంచి కాదు అని అంటుంది. ఆ తర్వాత అనసూయ కొన్ని మాటలు అనడంతో దివ్య ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇక వెంటనే తులసి తుళ్ళిపడగా వెంటనే తన తల్లి ఎందుకు ఏం జరిగింది అలా లేచావు అని అడుగుతుంది.
దాంతో దివ్య ఏడ్చినట్లు అనిపించింది అని తులసి అంటుంది. ఆ తర్వాత తులసి తల్లి దివ్యతో మాట్లాడిన తర్వాత దివ్య ఏడుస్తుంది నిన్ను రమ్మంటుంది అప్పుడు వెళ్తావా అనడంతో.. తను ఏం అడిగినా నువ్వు వెళ్ళవు కదా ఫోన్ చేసి తనను బాధ పెట్టడం ఎందుకు అని అంటుంది. ప్రయాణం వైపు నువ్వు అడుగులు వేయు అని సలహా ఇస్తుంది.
Intinti Gruhalakshmi:
మరోవైపు పరంధామయ్య తులసి కాఫీ అని అంటాడు. దాంతో దివ్య అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయాన్ని తాతయ్య మరిచిపోయాడు ఏమో అని అనుకుంటుంది. ఆ తర్వాత పరంధామయ్య బాధపడతాడు. ఇక కాఫీ నేను పెడతాను అని దివ్య లోపలికి వెళ్తుంది. మరోవైపు ప్రేమ్ అందర్నీ ఆశ్చర్యంగా పిలుస్తాడు.