Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్లో తులసి ఒంటరి ప్రయాణం మొదలు పెడుతుంది. ఇక ప్రేమ్ ను కూడా వద్దని చెప్పి తానే వెళుతుంది తులసి. మరోవైపు సామ్రాట్ తులసి గురించి భయపడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో ఏం జరుగుతుంది అని అనుకుంటాడు. ఇక ఎలాగైనా ఫోన్ చేయాలి అని తులసికి ఫోన్ చేస్తాడు. ఫోన్ కలవకపోవడంతో ప్రేమ్ కి ఫోన్ చేస్తాడు. ప్రేమ్ జరిగిన విషయం మొత్తం చెప్పటంతో సామ్రాట్ బాధపడతాడు.
ఆ తర్వాత సామ్రాట్ తులసిని వెతకడానికి బయలుదేరుతాడు. ఇక అనసూయ ప్రతిసారి తులసికి నాకు గొడవలు అయ్యేవి కానీ ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోలేదు అని అంటుంది. కానీ ఇప్పుడు ఇలా చేయడం నాకు నచ్చలేదు అని అంటుంది. ఇక నందు మనం ఏమైనా అనుకున్నామా ఇల్లు వదిలి వెళ్ళడానికి అని అంటాడు.
ఇక అనసూయ తను వదిలి వెళ్ళేటప్పుడు ఏమాత్రం బాధ కనిపించలేదు అని అంటుంది. వెంటనే లాస్య కలుగ చేసుకొని.. మనం ఏం వెళ్లిపోమనలేదు కదా తనంతలా తానే వెళ్ళింది కదా వదిలేయండి అని అంటుంది. దాంతో అభి అలా ఎందుకు అంటున్నారు అనటంతో.. ఇక లాస్య మనమేం చేయలేము అని అంటుంది.
ఓవైపు సామ్రాట్ తులసి కోసం వెతుకుతూ ఉంటాడు. పరంధామయ్య దేవుడి ముందు అఖండ జ్యోతి వెలిగిస్తాడు. ఇల్లు ఇప్పుడు చీకటిగా ఉంది అని తులసి వెళ్లిన దాని గురించి దేవుడికి చెప్పుకుంటూ బాధపడతాడు. తనని పంపించడం నాకు ఇష్టం లేకపోయినా కూడా తన జీవితంలో ఎదగాలని పంపించాను అని అంటాడు.
ఇక లాస్య దంపతులను ఉద్దేశించి అనటంతో లాస్య వాళ్ళు కోపంగా కనిపిస్తారు. తులసి ఒక పార్కులో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక పిల్లోడు వచ్చి ఏం జరిగింది అని అంటాడు. దాంతో తులసి ఆ బాబుని హత్తుకుంటుంది. ఆ బాబు నీకు అన్ని మంచి రోజులు వస్తాయి నువ్వు ఏమి బాధపడొద్దు అని అంటాడు. ఆ తర్వాత బాబు సరదాగా నవ్విపిస్తాడు.
ఇక అక్కడికి సామ్రాట్ కూడా చేరుకుంటాడు. అక్కడ తులసిని చూసి బాధపడతాడు. తర్వాత తులసిని ఫాలో అవుతాడు. ఇక తులసి ఒక ఇంట్లోకి వెళ్ళగా సామ్రాట్ తులసి గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. ఆ సమయంలో ప్రేమ్ ఆ ఇంటి దగ్గరికి అన్ని పట్టుకొని వస్తాడు. వెంటనే సామ్రాట్ అమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు.
Intinti Gruhalakshmi:
తర్వాత అది తన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని చెబుతాడు. ఇక సామ్రాట్ నేనిక్కడికి వచ్చిన విషయాన్ని తులసికి చెప్పొద్దు అని అంటాడు. దాంతో ప్రేమ్ మీరు కూడా అమ్మని అందరిలాగా వదిలేస్తున్నారా అనటంతో.. వెంటనే సామ్రాట్ బాధపడుతూ ఈ గొడవకి కారణం నా వల్లే కదా అని అంటాడు. దాంతో ప్రేమ్ మీరే మా అమ్మకి ధైర్యం ఇవ్వాలి అని మాట్లాడుతాడు.