Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో తులసి తన ఇంటి నుండి బయటకు వచ్చి అమ్మ గారి ఇంట్లో సెటిల్ అవుతుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా తులసిని చూసి చాలా సంతోషంగా పలకరిస్తారు. జీవితంలో ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది అని అనటంతో వెంటనే తులసి ఆ ఇంటి నుంచి వచ్చేసాను ఇంకా ఈ విషయం గురించి ఏమీ ఆలోచించకూడదు అని అంటుంది.
ఆ తర్వాత తులసి వాళ్ళ అమ్మ తులసి చేసిన పనికి మెచ్చుకుంటుంది. తన బిడ్డ సాహసం చేసింది అని గొప్పగా చెప్పుకుంటుంది. తన కూతుర్ని చూస్తే తనకు గర్వంగా ఉందని మురిసిపోతుంది. మరోవైపు ప్రేమ్ సామ్రాట్ తో మీరు కూడా అమ్మను వదిలేయకండి అంటే తనతో పాటు తీసుకొని వెళ్తాడు ప్రేమ్. ఇక పరంధామయ్య భోజనం చేయడానికి ఇష్టపడకపోవడంతో శృతి బ్రతిమాలుతుంది.
అయినా కూడా పరంధామయ్య తినడానికి ఇష్టపడడు. తనకు జీవించాలని లేదు అని బాధపడతాడు. ఇక లాస్య అదంతా చూస్తూ ఈ ముసలోడు ఏడుపులు చూడలేకపోతున్నాను అని అనుకుంటుంది. ఇక నందుతో ఒక్కసారి కూడా ఫోన్ చేయలేని తులసి గురించి ఎందుకిలా ఏడుస్తున్నాడు ఈ ముసలోడు అని అంటుంది. ఆ తర్వాత నందు దివ్యను పిలిచి తాతయ్యకు భోజనం నువ్వే చేయించాలి అని అంటాడు.
మొత్తానికి దివ్య తన తాతయ్యకు భోజనం తినిపిస్తుంది. ఓవైపు తులసి తన ఇంట్లో వాళ్లతో మీరు నన్ను నమ్ముతున్నారు కదా.. లేదంటే ఇప్పుడే వెళ్లిపోతాను అని అంటుంది. దాంతో తులసి వాళ్ళ అమ్మ నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు అని అంటుంది. అప్పుడే అక్కడికి సామ్రాట్ రావటంతో సామ్రాట్ ని చూసి షాక్ అవుతుంది. ఇక ప్రేమ అసలు విషయం చెబుతాడు. ఆ తర్వాత ఇదంతా నా వల్లే జరిగింది అని అంటాడు ప్రేమ్.
కానీ సామ్రాట్ మాత్రం ఇదంతా నా వల్ల జరిగింది అని అంటాడు. ఆ తర్వాత తులసి కొన్ని ఎమోషనల్ డైలాగులు కొడుతుంది. ఇక ఇంట్లో లాస్య నందును రెచ్చగొడుతుంది. ఇక నందు తన మాటలు వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడు. ఇక సామ్రాట్ దూరం అయ్యాడు అని కుటుంబం దగ్గరయింది అని సంతోషపడతాడు నందు. ఇక బాధ్యతలు నేనే తీసుకుంటాను అని అంటాడు నందు.
Intinti Gruhalakshmi:
ఇక లాస్య కూడా అందరిని దగ్గరికి తీసుకునే సమయం ఇదే అని అంటుంది. ఇక ఉద్యోగం వెతకాలి అని నందు అంటాడు. ఇంట్లో తులసి పేరు వినిపించద్దు.. కనిపించకూడదు అని బోర్డు పీకి పారేస్తాడు. దీపక్ సామ్రాట్ కి థాంక్స్ చెబుతాడు. తులసి వాళ్ళ అమ్మ కొన్ని డైలాగులు కొడుతుంది. ఆ తర్వాత సామ్రాట్ ఒంటరిగా తులసి రంగంలోకి దిగినందుకు తనకు ధైర్యం ఇస్తాడు. ఆ తర్వాత తులసి తన బిడ్డ ప్రేమ్ తను ఎన్ని మాటలు అన్నా కూడా తనతోనే ఉన్నాడు అని గర్వంగా చెప్పుకుంటూ సంతోషపడుతుంది.