Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 25వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో పరంధామయ్య, అనసూయతో నందు తులసిని వదిలేసి అన్యాయం చేశాడు. కోడలు కూతురై మనకు అండగా ఉంది. మనం ఏం చేయలేకపోయాము. తన కాళ్ళ మీద తాను నిలబడాలి, మ్యూజిక్ స్కూల్ ఓపెన్ చేయాలి అనుకుంటుంది. ఇలాంటప్పుడు లోకం మాటలు విని మనం తులసిని ప్రశ్నిస్తే కుప్పకూలిపోతుంది అంటూ వెళ్లిపోతాడు పరంధామయ్య.
తర్వాత సన్నివేశంలో ప్రేమ్, శృతి తో నీ బట్టలు తీసుకొచ్చాను అంటే నేనిక్కడ ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు ఎందుకు తీసుకొచ్చావు నేను చెప్పలేదు కదా. ప్రేమ్ మరి ఆశ ఎందుకు పెట్టావు అంటే నేను నీకు చెప్పలేదు ఉంది శృతి. నేను కేవలం ఆంటీ గారి కోసమే ఇక్కడ ఉన్నాను నీకోసం కాదు అంటుంది శృతి. ఉక్రోషంతో ఉడికిపోతున్నావు నీ సంగతి నాకు తెలియదా అని బదులు చెప్తుంది శృతి. దుప్పటి దిండు కింద వేస్తుంది నువ్వు నాకోసం అంత త్యాగం ఏం చేయల్సిన అవసరం లేదు అని ప్రేమ్ అంటే ఇది నా కోసం కాదు నీ కోసమే ఇక్కడ కింద పడుకుంటావో, లేదా హాల్లో పడుకుంటావో ఛాయిస్ నీదే అంటుంది.
తర్వాత సన్నివేశంలో మామయ్య ఎక్కడ అంటూ చూస్తున్న తులసికి పరంధామయ్య ఫోన్ చేసి సీరియస్ గా నేను సామ్రాట్ ఇంట్లో ఉన్నాను వెంటనే ఇక్కడికి రమ్మని అంటాడు. మీరు అంత సీరియస్ గా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది నేను ఏం తప్పు చేశాను అంటుంది తులసి. ఏం జరిగిందో నీకు తెలియదా నీ ప్రమేయం లేకుండానే విషయం ఇంత దాకా వచ్చిందా చేయాల్సిందంతా చేసి అమాయకురాలుగా మాట్లాడతావా దానికి మామయ్య మీకు చెప్పకుండా తెలియకుండానే నేనేమీ చేయలేదు. ఇక మాటలు అనవసరం ఎవరికీ చెప్పకుండా నువ్వు సామ్రాట్ ఇంటికి వచ్చేసేయ్ అని ఫోన్ కట్ చేస్తాడు.
తరువాత సన్నివేశంలో కంగారుగా సామ్రాట్ ఇంటికి బయలుదేరుతుంది తులసి. కాలింగ్ బిల్ కొట్టగానే సామ్రాట్ డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు తులసి మా మామయ్యకు కాస్త కోపం చాదస్తం ఎక్కువ ఏదైనా నోరు జారి మాట్లాడితే క్షమించండి అంటుంది. తర్వాత మామయ్య ఎక్కడ అని లోపలికి వస్తే మామయ్య ఇంకా సామ్రాట్ యొక్క బాబాయి చెస్ ఆడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి మామయ్యపై కాస్త కోపంగా ఏంటి మామయ్య ఇది ఎందుకు పిలిచారు ఇంత కంగారు ఎందుకు పెట్టారు అంటూ అంటుంది. అందరూ కలిసి సర్ప్రైజ్ అంటూ తులసిని త్రిల్ చేస్తారు. తరువాత నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని అంటూ ఉంటే ఎవరో ఒకరు చెప్పొచ్చు కదా అంటుంది తులసి.
తర్వాత సామ్రాట్ నేనే చెప్తాను అంటాడు. తర్వాత ఒక ప్లేట్ తీసుకువస్తుంది ఒక పని అమ్మాయి. సామ్రాట్ అది తీసుకొని ఒకసారి ఇది తీసి చూడండి అంటే వాళ్ళ మామయ్య ఉండు అని ఫోన్ లో సంగీతం పెడతాడు. ప్లేట్ ఓపెన్ చేసి చూసిన తులసి ఇది మ్యూజిక్స్ స్కూల్ ఓపెనింగు భూమి పూజ అంటే చానా ఎమోషనల్ గా గతంలో తన భర్త, ప్రేమ్ బర్త్ డే కి చేయించిన ఇన్విటేషన్ కార్డులో తన పేరు వేయించకుండా కాస్త చిరాకుగా భర్త మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. మ్యూజిక్ స్కూల్ ఇన్విటేషన్ కార్డులో తన పేరు చూసి ఎంతగానో మురిసిపోతుంది తులసి. తనను తాను మర్చిపోయి నవ్వుకుంటుంది. సామ్రాట్ కు మనస్ఫూర్తిగా థాంక్యూ చెప్తుంది. నా పేరు ఇన్విటేషన్ కార్డులో రాసినందుకు చాలా థాంక్స్ అండి.
చాలా పెద్ద విషయం అమ్మాయికు పుట్టినప్పుడు చాలా పేర్లు వెతికి మంచి పేరు సెలెక్ట్ చేసి ఆ పేరు పెడతారు. పెళ్లయ్యే వరకు దానిని ఫలానా వారి కూతురు అని చెప్పుకుంటారు. పెళ్లయిన కూడా ఆడదానికి గుర్తింపు, పేరు వస్తుందేమో అనుకుంటే ఫలానా వారి భార్య అంటారు. పిల్లలు పుట్టాక ఆయన రాత మారుతుంది అనుకుంటే అప్పుడు కూడా ఫలానా పిల్ల అని అలాగే చెబుతారు. ఇలాంటి ఆహ్వాన పత్రిక మీద తన పేరుతో పాటు తన భార్య పేరు వేయించడానికి ఇష్టపడరు. సామ్రాట్ గారు ఇది నిజం.
Intinti Gruhalakshmi:
అందుకే ఈ కార్డు పై పేరు చూసి నన్ను నేను మర్చిపోయాను. మగవాడు కష్టపడితే గుర్తింపు వస్తుంది. అదే ఆడది కష్టపడితే అస్సలు గుర్తింపు రాదు. ఆడది రాజీపడి, సర్దుకుని బతకాల్సిందే అంటుంది తులసి. నా పేరు తర్వాత మీ పేరు వేయించుకున్నారు, మీకు చిన్నతనంగా లేదా అంటే ఈ మ్యూజిక్ స్కూల్ మీది ఈ కళ మీది, నాది కానప్పుడు నా పేరు ఎలా ముందు వేయించుకుంటాను అంటాడు సామ్రాట్. కానీ డబ్బు మీది అని తులసి చెబుతుండగా ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరివాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.