Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండగా అనసూయ ఆపే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అడిగే హక్కు లేదు అని పరంధామయ్య అనడంతో.. నా మెడలో తాళి ఉన్నంతవరకు ఆ హక్కు నాకు ఉంటుంది అని అంటుంది. దాంతో పరంధామయ్య లాక్కోమని ఆ దేవుడికి చెప్తాను నీ హక్కుని కాదు నీ మీదలో ఉన్న తాళిని అని అనటంతో అందరూ షాక్ అవుతారు.
ఇక నందు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అనటంతో ఈ ఇంట్లో ఉంటే స్మశానంలో ఉన్నట్లు ఉంది అందుకే గుడికి వెళుతున్నాను అని అంటాడు. మరోవైపు సామ్రాట్ అభి అన్నది కరెక్టే అని నా వల్లే ఇలా జరుగుతుంది అని బాధపడతాడు. అంతేకాకుండా నా జాతకం ఏంటో నా చెల్లెల్ని కాపాడుకోలేకపోయాను.. ఇప్పుడు తులసిని కష్టాల్లో పెడుతున్నాను అని అనుకుంటాడు.
ఇక సామ్రాట్ కనిపించకపోవడంతో తులసి బయటకి వచ్చి వెతుకుతుంది. సామ్రాట్ కనిపించడంతో ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. ముందు ఇంటికి వెళ్దాం రండి అని అంటుంది. కానీ సామ్రాట్ మాత్రం నేను మీకు అందకుండా దూరంగా వెళుతున్నాను నా గురించి ఆలోచించకండి అని అంటాడు. ఇక తులసి మాత్రం నా స్నేహితుడు ఎప్పటికి నన్ను వదిలి వెళ్ళకూడదు అని అంటుంది.
వెంటనే సామ్రాట్ నేను కూడా ఇన్నాళ్లు అదే అనుకున్నాను అంటూ కానీ ఇప్పుడు అవి మాటలు విన్న తర్వాత బయట వాళ్ళు అభిప్రాయం ముఖ్యమని అర్థమైంది అంటాడు. ముందు మీ ఇంట్లో వాళ్ళ మనసులో ఉన్న కన్ఫ్యూజన్ తీసేయాలి అని నందు దగ్గరికి వెళ్లాలని అనుకుంటాడు. తులసి మాత్రం ఇప్పుడు వద్దు అంటుంది. ఓవైపు ఇంట్లో వాళ్లంతా ఇదంతా తులసి వల్లే వచ్చింది అని కోపంగా కనిపిస్తారు. ఇక అభి కూడా అవును అంటూ వాళ్ళను గట్టిగా నిలదీశాను కూడా అని అంటాడు.
వెంటనే అంకిత ఆంటీ గురించి అలా మాట్లాడొద్దు అని కోపంగా అంటుంది. అనసూయ కూడా తులసిపై బాగా కోపంతో కనిపిస్తుంది. అదే సమయంలో అక్కడికి సామ్రాట్ రావటంతో నందు వెళ్ళిపో అని కోపంగా అంటాడు. అని సామ్రాట్ గట్టిగా మాట్లాడటానికి వస్తాడు. తులసిని ఏమనొద్దు అని అంటాడు. మీరు ఆమెను ఎంత అవమానపరిచిన మీకోసమే ఆలోచిస్తుంది అని.. అది ఆమె గొప్పతనం అంటూ పొగుడుతాడు.
ఇక వెంటనే నందు సామ్రాట్ మాటలకు కాలర్ పట్టుకుంటాడు. అదే సమయంలో తులసి సామ్రాట్ కోసం వస్తుంది. అంతేకాకుండా నందు సామ్రాట్ పై అరుస్తాడు. మీ మధ్య ఉన్న బంధానికి పేరు పెట్టండి అని.. అది స్నేహమైతే కాదు అని అట్రక్షనా.. మోహమా అంటూ నోటికి వచ్చిన మాటలతో మాట్లాడుతాడు. మీ వల్లే ఇలా గొడవలు జరుగుతున్నాయి అని అంటాడు.
అంతేకాకుండా మీరిద్దరూ ప్రేమించుకొని ఇలా స్నేహం ముసుగులో ఉన్నారు అంటూ రెచ్చిపోయి మాట్లాడుతాడు. దాంతో సామ్రాట్ తను ప్రేమించింది నిజమే అని అనటంతో అందరూ షాక్ అవుతారు. అవును ఆమె ప్రేమించింది నందును అంటూ.. ఇప్పటికీ ఆమె మనసులోని అందుకే గొప్ప స్థానం ఉంది అని.. మీరు ఎన్ని మాటలు అంటున్నా తులసి దృష్టిలో దేవత అని తులసి గురించి గొప్పగా చెబుతాడు సామ్రాట్.
Intinti Gruhalakshmi:
అంతేకాకుండా నందు పై కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. మళ్లీ కాలర్ పట్టుకొని ఓవర్గా ప్రవర్తించడంతో సామ్రాట్ మరింత కోపంతో రగిలిపోతాడు. ఇక అదే సమయంలో అక్కడికి ప్రేమ్ వచ్చి తులసిని చూస్తాడు. ఇక తులసి ఆ మాటలు విని బయటికి వెళ్తుండగా ప్రేమ్ తన తల్లిని ఫాలో అవుతాడు.