Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో తులసి కుటుంబ సభ్యులంతా గుడికి వెళ్తారు. కాసేపటి తర్వాత అక్కడకు నందు, లాస్యలు వస్తారు. వాళ్లను చూసి అనసూయ సంతోషంగా ఇక్కడ ఉన్నామంటూ గా చెయ్యి ఊపుతుంది. అప్పుడు పరమానందయ్య ఎవరినో చూసి చెయ్యేందుకు ఊపుతున్నావంటే, ఎవరో కాదు మన కొన్న కొడుకు అంటుంది. తర్వాత లాస్య వచ్చి అనసూయ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత నందు కూడా అనసూయ వద్ద ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు అనసూయ, నందుకు జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చింది కదా పూజ చేసుకుందాం అంటే నేనే గుడికి రండి ఇక్కడే చేసుకుందామని చెప్పాను అంటుంది.
తరువాత తులసి అర్చన చేపించబోతుండగా ఇంతలో లాస్య ఈరోజు మేము అత్తయ్య పేరు మీద అర్చన చేపిస్తామని, పూజ చేపిస్తుంది. తులసి మనసులో తన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని, ఎటువంటి ఆటంకాలు రాకూడదని కోరుకుంటుంది. పూజ ముగిశాక పూజారి ఈరోజు చాలా పవిత్రమైన రోజు ఏదైనా కోరిక కోరుకుని ముడుపు కట్టుకుంటే ఆ అమ్మవారు అనుగ్రహిస్తారు అని చెప్తాడు. అప్పుడు తులసి నా ఇద్దరు కోడళ్ళు నాకు మనువడు, మనవరాలను ఇస్తే సంతోషంగా ఉంటుందని చెబుతుంది. అప్పుడు పూజారి ముడుపు కడితే సంవత్సరం తిరిగే లోపు మనవడు, మనవరాలు మీ చేతిలో ఉంటారు అంటాడు.
తరువాత సన్నివేశంలో లాస్య మనసులో కోరిక బాగానే ఉంది. మరి సామ్రాట్ గురించి ఏం ఆలోచిస్తుందో ఏం అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. అంకిత, శ్రుతిలు ముడుపు కట్టడానికి ఇబ్బంది పడుతుంటే పూజారి వచ్చి భర్తల సహాయం తీసుకోండి. జంటగా ముడుపు కడితే మంచి ఫలితం ఉంటుంది అనడంతో అభి, ప్రేమ్ లు వాళ్ల భార్యలను ఎత్తుకొని ముడుపు కట్టిస్తారు. తర్వాత తులసి తొందరగా వెళ్దాం పదండి కాలనీలో అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ అందరూ కాలనీకి వచ్చేస్తారు.
కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చాలా కొత్తగా ఉంది. అందరూ కలిసి ఒక చోట ఈ పండగను చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెబుతుంది. తర్వాత తులసి గారిని పాట పాడి పండగ సంబరాన్ని మొదలు పెట్టండి అనడంతో తులసి బతుకమ్మ పాటను పాడుతుంది. అప్పుడు లాస్య మనసులో ఏదో జరిగింది అందుకే తులసి, సామ్రాట్లు దూరంగా ఉన్నారు. ఆ విషయం ఏంటో తెలుసుకొని శాశ్వతంగా దూరం ఉండేలా చేస్తేనే నాకు నిజమైన పండగ అని అనుకుంటుంది. తరువాత హనీని పక్కకు పిలిచి మీ నాన్న వచ్చుంటే బాగుండేది కదా అంటుంది. ఆయనకు మీటింగ్ ఉందంట అందుకే రాలేదు అంటుంది హనీ. అదేంటి నీకన్నా మీటింగ్ ముఖ్యమా, నీ చెయ్యి బా లేనప్పుడు మేమంతా మీ ఇంట్లో ఉన్నాం కదా ఇప్పుడు మాత్రం నువ్వు ఒక్కదానివే సంతోషంగా ఉన్నావు అనడంతో హనీ ఫోన్ చేసి కడుపునొప్పి ఉంది రావాలని చెబుతుంది. అటువైపు నుంచి సామ్రాట్ కంగారుగా బయలుదేరుతాడు. ఇక్కడనేమో కాలనీ వాళ్లంతా సంబరాలు చేసుకుంటూ కొన్ని చీటీలు రాసి అందులో ఏది వస్తే అది చేయాలి అని అంటారు.
Intinti Gruhalakshmi:
మొదట అభి చీటీ తీసి చదివి సైగలతో అంకితకు చెబితే పేరు కనుక్కోలేక పోతుంది. తరువాత నందు కూడా ఒక చీటీ తీసి అందులో ఉండేది సైగ చేస్తే లాస్య కూడా కనుక్కోలేక పోతుంది. అతనితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.