Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో అనసూయ అందరితో ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది. అందరికీ క్షమాపణలు చెప్పుకుంటుంది. ఒకప్పుడు అందర్నీ బాధ పెట్టాను అని అంటుంది. దాంతో తులసి ఇప్పుడు మీరు చెప్పే మాటలకు ఎవరు వినాలని లేరు కాబట్టి మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని అంటుంది. కానీ అనసూయ మాత్రం నావల్ల ఇంత జరిగినప్పుడు ఎలా ఉంటాను అని అంటుంది.
ఇక తులసి మాత్రం అలా ఏమీ కాదు ఇప్పటికైనా మీరు బాగుంటే అదే ప్రాయశ్చిత్తం అని అంటుంది. మరోసారి అలాంటి పొరపాటు చేయకుండా ఉంటే సరిపోతుంది అని సలహా ఇస్తుంది తులసి. ఇక జరిగిన విషయాలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండమని అంటుంది. దాంతో అనసూయ కూడా సరే అనగా ఆ తర్వాత అనసూయ తులసిని ఒక కోరిక అడుగుతుంది.
నావల్ల నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా అనటంతో.. వెంటనే తులసి మళ్లీ నేను ఈ ఇంట్లో ఉండను అత్తయ్య ఆ మాట అయితే అనకండి అని అంటుంది. దాంత అనసూయ కూడా అలా కాకుండా ప్రతిరోజు నాకోసం వస్తూ ఉండు అని నిన్ను చూడకుండా ఉండలేను అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది. దాంతో తులసి కాదంటుంది. రాలేను అని అంటుంది.
ఈ ఇంటికి నేను వస్తే ఆనందం కంటే ఎక్కువగా నష్టం జరుగుతుంది అని అంటుంది. కానీ అనసూయ మాత్రం చాలా బ్రతిమాలుతుంది. మరోవైపు లాస్య లోపల వాళ్లంతా ఏం మాట్లాడుకుంటున్నారో అని కోపంతో కనిపిస్తుంది. నన్ను కుటుంబ సభ్యురాలు కాదని బయటికి పంపిస్తుందా అంటూ తన అత్తయ్యపై బాగా కోపాన్ని చూపిస్తుంది. అంతే కాకుండా సోఫాలో ఉన్న చీరను కింద పడేసి తొక్కుతుంది. అందరూ కలిసి ఆస్తి పంచుకోవాలని చూసుకుంటున్నారా అని అనుకుంటుంది.
ఇక గదిలో అనసూయ మాత్రం రావాలి అనడంతో తులసి నేను రాలేను కానీ మీరు మాత్రం వస్తూ ఉండండి అని అంటుంది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటుంది. దాంతో అనసూయ చాలా బాధపడుతుంది.చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ ఉండటంతో తులసి ఆ మాటలకు కరిగి సరే అని అంటుంది. నా బాధలన్నీ పక్కన పెట్టి మీకోసం వస్తాను అని అంటుంది.
దాంతో అందరు సంతోషంగా కనిపిస్తారు. అంతేకాకుండా సరదాగా కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. పరంధామయ్య కూడా అనసూయ పై సరదాగా కామెంట్లు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తులసి అక్కడి నుంచి వెళుతుండగా దేవుడి దగ్గర ఉన్న దీపం ఆరిపోతూ ఉండగా అడ్డుపెట్టి వెలిగిస్తుంది. అది చూసి లాస్య తులసి దగ్గరికి వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది.
ఇద్దరి మధ్య కాసేపు మాటలు యుద్ధం జరుగుతుంది. లాస్య రెచ్చిపోయి మాట్లాడుతుండగా అంతకుమించి తులసి మాట్లాడుతుంది. ఆ తర్వాత తులసి నిన్ను నాతో పోల్చద్దు అని అంటుంది. లాస్య మా ఇంట్లో ఎందుకు పెట్టావు అంటూ కొన్ని డైలాగులు కొడుతూ ఉంటుంది. తులసి కూడా ఏమాత్రం తగ్గకుండా బాగానే రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత నీకు దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అని తులసి అంటుంది.
Intinti Gruhalakshmi:
కానీ లాస్య మాత్రం కోపంతో చిరులెత్తుతుంది. సామ్రాట్ పేరును కూడా లాగుతుంది. అలా వీరిద్దరి మధ్య బాగానే మాటలు యుద్ధం జరగగా ఆ తర్వాత తులసి అక్కడి నుంచి దేవుడికి దండం పెట్టుకుంటూ ఇల్లు స్వర్గంగా మారాలి అంటే ఆ ఇంటి కోడలు చేతిలోనే ఉంది.. ఈ ఇంటి కోడలికి కొంచెం మంచి బుద్ధి ఇవ్వు అని దండం పెట్టుకొని వెళ్తుంది. దాంతో లాస్యకు బాగా కోపం వస్తుంది.