Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ ఆరవ తేదీ ఎపిసోడ్లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో హనీ బర్త్డే ఫంక్షన్ లో సామ్రాట్, తులసి మేనేజర్ పోస్టును నందుకు ఇస్తున్నట్లు ప్రకటిస్తాడు. సామ్రాట్ నిర్ణయాన్ని తులసి సమర్థిస్తుంది. నందగోపాల్ కు శుభాకాంక్షలు చెబుతుంది. ఇంతలో లాస్య కలగజేసుకొని మొహమాటం కొద్ది మాట్లాడుతున్నావా లేదా మనసులో ఒకటి పెట్టుకుని ఇంకోటి మాట్లాడుతున్నావా అని తులసిని అడుగుతుంది. నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో నందగోపాల్ గారికి బాగా తెలుసు అని చెబుతుంది తులసి. తరువాత తులసి కుటుంబ సభ్యులను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
తులసి ఇంట్లో అందరూ కూర్చొని ఉండగా అభి, అనసూయ ముఖాలలో సంతోషం కనబడుతుంది. మిగతా కుటుంబ సభ్యులు బాధలో ఉంటారు. అప్పుడు అనసూయ ఏం జరిగినా మన మంచికే జరిగింది అనుకోవాలి. ఇప్పుడు జాబ్ మాత్రమే కదా పోయింది ఎందుకు అందరూ అంతలా బాధపడుతున్నారు అని అంటుంది. అప్పుడు దివ్య కలగజేసుకొని ఇదేమీ చిన్న విషయం కాదు జాబ్ విషయం గురించి అందరి ముందు మాట్లాడిన అవసరం ఏముంది అని అంటుంది. ఇదంతా ఎవరో చెప్తే చేసినట్టు ఉంది. అంటే అప్పుడు శృతి చిన్నపిల్లలు కాదు కదా ఎవరో చెప్పింది చేయడానికి ఆయన ఆ కంపెనీకి బాస్ అంటుంది.
తర్వాత సన్నివేశంలో తులసి అక్కడికి వస్తే అందరి ముఖాలను చూసి ఇప్పుడు ఏం జరిగిందని అంత బాధ పడుతున్నారు అంటే ప్రేమ్ నీకు బాధ లేదా అమ్మా అని ప్రశ్నిస్తాడు. నేను మొదటి నుంచి మేనేజర్ పదవి వద్దు అనుకున్నాను. అందరి బలవంతం మీదనే ఆ పోస్టులో కూర్చున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. అప్పుడు అనసూయ ప్రశాంతంగా పదిమంది పిల్లలకు మ్యూజిక్ పాఠాలు చెప్పుకుంటే ఇల్లు గడుస్తుంది. ఇంత మాత్రానికి అందరూ బాధపడాల్సిన అవసరం లేదు అంటే నిజం చెప్పారు అత్తయ్య అంటుంది తులసి.
తర్వాత సన్నివేశంలో సామ్రాట్ యొక్క బాబాయి గట్టిగా నిలదీస్తే అసలు నిజం చెప్పేస్తాడు సామ్రాట్. అనసూయ ఆంటీ గారు ఇంటికి వచ్చి తులసిని దూరం పెట్టమని కోరారని చెప్తాడు. మరొకవైపు ప్రేమ్ కూడా తన తల్లిని ఎవరో ఏదో అన్నారని గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాడు. నేను తులసి గారికి అన్యాయం చేశాను కాదు అనడం లేదు కానీ ఆమె వ్యక్తిత్వాన్ని సమాజంలో చెడుగా చెప్పుకుంటే తట్టుకోలేను అంటాడు. తర్వాత ఆఫీసుకు బయలుదేరి టైం అవుతుండగా, తులసిని మేనేజర్ పోస్ట్ నుండి తీసేసినట్టు మరిచిపోయి వెళ్తుండగా ఇంతలో బాబాయి గుర్తుచేసి తులసిని నువ్వే తీసావు కదా అని ప్రశ్నిస్తాడు.
Intinti Gruhalakshmi:
తరువాత సామ్రాట్, లాస్యతో మ్యూజిక్ స్కూల్కు సంబంధించిన అన్ని విషయాలు మీరే చూసుకోండి. నాకు వేరే ప్రాజెక్టులో కొన్ని బిజీ పనులు ఉన్నాయి అని చెప్తాడు. తర్వాత లాస్య చిన్న క్లారిఫికేషన్ చేయండి తులసిని ఆఫీసుకు దూరం చేశారు కదా మరి ఈ మ్యూజిక్ స్కూల్ కంటిన్యూ చేయడం అవసరమా అని అడుగుతుంది. అప్పుడు సామ్రాట్ ఇది నా కంపెనీ ప్రెస్టేజ్ ఇష్యూ ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టాక ఎట్టి పరిస్థితులను ఆపడానికి కుదరదు అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.