Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 4వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో తులసి, సామ్రాట్ యొక్క పీఏతో ఆ ఫైల్ మీద సంతకం చేయించమని నీతో ఎవరో చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో చెబితే నీ జాబ్ కు ఎటువంటి డోకా ఉండదు అని అంటుంది. అప్పుడు ఆ పిఎ ఎవరు అలా చేయించలేదు నేనే పొరపాటు పడ్డాను నన్ను క్షమించండి. సామ్రాట్ సార్ ముందు నా వల్లే తప్పు జరిగింది అని ఒప్పుకుంటాను అని అంటుంది. తులసి బాధపడుతూ అక్కడ నుండి వెళ్తుంది. తులసి వద్దకు సామ్రాట్ యొక్క బాబాయి వచ్చి నిన్ను అంతలా నిలదీస్తుంటే ఇందులో నీ తప్పేమీ లేదని చెబితే బాగుండేది కదా అంటాడు. అప్పుడు తులసి తెలిసి చేసినా తెలియక చేసిన తప్పే కదా 10 కోట్ల నష్టం వస్తుందంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు అని అంటుంది. అప్పుడు బాబాయ్ ఇవన్నీ మనసులో పెట్టుకుని సాయంత్రం హనీ బర్త్డే పార్టీకి రాకుండా ఉండవద్దు అంటే సరే అంటుంది.
తరువాత సన్నివేశంలో పిఎ రిజిగ్నేషన్ లెటర్ తీసుకొని సామ్రాట్ వద్దకు వెళుతుంది. సామ్రాట్ ఆ లెటర్ తీసుకుని చించేసి నేను చెబితేనే నువ్వు చేశావు కదా అంటే, అందుకు మీరు తులసి గారిని అందరి ముందు దోషిగా నిలబెడితే నేను తట్టుకోలేక పోయాను. అనవసరంగా అందరి ముందు తులసి మేడం మాటలు పడవలసి వచ్చింది కదా అంటుంది. నేనేం చేసినా తులసి మంచికే చేస్తాను అంటూ సామ్రాట్ ఈ విషయం ఇక్కడితో మర్చిపో అంటాడు.
తర్వాత సన్నివేశంలో బర్త్డే ఫంక్షన్ లో సామ్రాట్ ఆలోచిస్తూ ఉండగా అతని బాబాయి నువ్వు ఎవరు రాక గురించి ఎదురు చూస్తున్నావో నాకు బాగా తెలుసు. తులసి వచ్చాక తనకు సారీ చెప్పు అని సలహా ఇస్తాడు. ఇంతలో తులసి కుటుంబ సభ్యులతో వస్తుంది. వీళ్ళ వెనకే నందు, లాస్యలు కూడా వస్తారు. సామ్రాట్ అందరినీ పలకరిస్తాడు. కానీ అనసూయ కాస్త కోపంగా చూస్తూ ఉంటుంది. తరువాత లాస్య ఆఫీస్ లో జరిగిన విషయం చెప్పే ప్రయత్నం చేయగా సామ్రాట్ యొక్క బాబాయి ఆఫీసు విషయాలు ఇక్కడ మాట్లాడి ఫంక్షన్ డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. తర్వాత అందరు వెళ్తుండగా నందు, పరంధామయ్యతో నన్ను పలకరించాలి అని అనిపించలేదా నాన్న అంటాడు. నేను చావుకు దగ్గర పడ్డానని ఆత్మాభిమానాన్ని చంపుకోలేను అంటాడు పరమానందయ్య. తర్వాత అభి కలుగజేసుకొని అనసూయతో ఏంటి నానమ్మ ఇదంతా తాతయ్య ఎందుకిలా ముందుగా ప్రవర్తిస్తున్నాడు. ఎన్ని జరిగినా మామ్ అందరినీ పలకరిస్తుంది కదా తాతయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటాడు.
Intinti Gruhalakshmi:
తరువాత సన్నివేశంలో తులసి, హనీను ఫంక్షన్కు రెడీ చేస్తుంది. ఇదంతా సామ్రాట్ చూస్తూ ఉండడం అతని బాబాయి గమనించి నాలుగు ఐదు సెటైర్స్ వేస్తాడు. తరువాత సామ్రాట్, హనీకి తాను తెచ్చిన డ్రస్సు వేయమని తులసికి చెబుతాడు. హనీ, తులసి ఆంటీ తెచ్చిన డ్రెస్ చాలా బాగుంది అంటే కాస్త చిరాకుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత అనసూయ, సామ్రాట్ ను ఇచ్చిన మాట ఏం చేశావని నిలదీస్తుంది. సామ్రాట్ మాట్లాడే ప్రయత్నం చేయగా అనసూయనే ఎక్కువగా రియాక్ట్ అయ్యి మీ మనసులో ఏముంది అని ప్రశ్నిస్తుండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.