Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సామ్రాట్ ను గట్టిగా నిలదీసిన అభికి, సామ్రాట్ యొక్క బాబాయి దాగి ఉన్న గతాన్ని చెప్పే ప్రయత్నం చేయగా సామ్రాట్ అడ్డుపడతాడు. అయినా వినకుండా హనీ సామ్రాట్ చెల్లెలి కూతురు అని నిజం చెప్పేస్తాడు. సామ్రాట్ కు చెల్లెలు అంటే ప్రాణం చిన్నప్పటినుండి గారాబంగా పెంచుకున్నాడు. చెల్లెలు మేనేజర్ నీరజ్ ను ప్రేమించింది. చెల్లెలి ప్రేమను కాదనలేక మేనేజర్ కు ఇచ్చి వివాహం చేసి ఆస్తిలో వాటా కూడా ఇచ్చాడు. నీరజ్ ఆస్తి మొత్తం వృధా చేసి, ఇంకా ఆస్తి కావాలంటూ భార్యను వేధించాడు. తాను అన్న మాట వినకుండా తప్పు చేశానని హనీ ని సామ్రాట్ ఇంటి గుమ్మం ముందు ఉంచి తాను ఆత్మహత్య చేసుకుంది. హనీ కోసమే పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్నాడు అని చెప్పేస్తాడు.
తరువాత సామ్రాట్ నా చెల్లి రక్తం పంచుకొని పుట్టిన హనీ అంటే నాకెంతో ప్రాణం. మీరు అని మీ ఇంటికి తీసుకెళ్తా అంటే, మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. దయచేసి ఎవరూ కూడా హనీకి ఈ నిజం చెప్పొద్దు అని ప్రాధేయపడతాడు. అందరి తరపున తులసి ఈ నిజం ఎవరికీ తెలియదని మాట ఇస్తుంది. మరొకవైపు నందు, లాస్యలు కూడా ఈ నిజం ఎప్పటికీ హనీకు తెలియకుండా చేస్తామని మాట ఇస్తారు. ఇక అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు.
తర్వాత సన్నివేశంలో నందు, లాస్య పై చిరాకు పడుతూ ఏదో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తా అన్నావ్ కదా అని ప్రశ్నిస్తాడు. నన్నేం చేయమంటావు ప్రెస్ వాళ్లు నేను చెప్పిన విధంగానే సామ్రాట్ను టార్గెట్ చేసి ప్రశ్నలు అడిగారు. నీ మాజీ భార్య అలా మాట్లాడుతుందని ఎవరు ఊహించారు అంటుంది. ఇక సామ్రాట్ బ్రహ్మచారి కాబట్టి తులసికి దగ్గరవుతున్నాడు అంటూ మీ అమ్మ చెవిలో ఒక వార్త వేస్తే మొత్తం ఆమె చూసుకుంటుంది అంటుంది. అందుకు నందు మా అమ్మ తులసి ఫ్యాన్ అసోసియేషన్ కు ఫౌండర్ అస్సలు మన మాట వినదు అంటాడు. లాస్య ఇంతకుముందు మీ అమ్మ మన మాటనే వినేది ఇప్పుడు తులసి మాట వింటుంది తర్వాత మన మాట వినదు అని గ్యారెంటీ ఏముంది. మనం చెప్పే విధానంలోనే ఉంటుంది అంతా అని అంటుంది.
తర్వాత సన్నివేశంలో బాధపడుతున్న పరంధామయ్య వద్దకు తులసి వస్తే, చెల్లెలి కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళం చూసాం కానీ చెల్లెలి కూతురు కోసం ఇలా ఒంటరి జీవితం గడిపే సామ్రాట్ చాలా గొప్పవాడు అని అనుకుంటారు. తర్వాత టీవీలో ప్రెస్ మీట్ లో సామ్రాట్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆ మౌనం వెనుక కారణం ఏంటో ఆయనే చెప్పాలి. ఇక ప్రెస్ మీట్ మొత్తం తులసి గారే మాట్లాడారు. ఆమె నిజాయితీ, ఆమె ఎదగాలనే పట్టుదల ఇంత గొప్పగా ఉన్నాయి. అని వచ్చే వార్తలు ఒకవైపు సామ్రాట్ చూసి బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు తులసి ఇంట్లో అభి చాలా అసభ్యకరంగా మాట్లాడతాడు. అందుకు కుటుంబ సభ్యులు అందరూ అభిపై కోప్పడతారు.
Intinti Gruhalakshmi:
అభి నాకు కూడా మామ్ అంటే ప్రేమ, గౌరవం ఉంది. తాను ఎదగాలని నాకు కూడా ఉంటుంది కదా. ఆస్తి రాకుండా చేసిందని కోపం ఉంది కానీ మరీ అంత నీచుడిని కాను, అమ్మ నిజాయితీని సంకించలేను. అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.