Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో తులసి ఆఫీసులో కూర్చుని ఫైల్స్ చెక్ చేస్తూ ఉండగా ఇంతలో నందు, లాస్యలు వస్తారు. లాస్య నీ మాజీ భార్య చూడు మొదటి రోజే ఫైల్ చూస్తూ ఎలా చేతిలో పెన్ను తిప్పుతుందో, ఇంతకుముందు ఇంట్లో గరిట తిప్పేది ఇప్పుడు మరీ రెచ్చిపోతుంది అంటూ నందుతో చెబుతుంది. కాసేపటికి తులసి వచ్చి బడ్జెట్ ఫైల్ తయారు చేయమన్నాను కదా ఏమైంది అని లాస్యను ప్రశ్నిస్తుంది. అందుకు లాస్య నేను చాలా బిజీగా ఉన్నాను చేస్తాను అంటే మధ్యాహ్నం కల్లా రెడీ కావాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు లాస్య నందుతో నీ మాజీ భార్య చూడు ఎలా రెచ్చిపోతుంది అంటే నువ్వే చెప్పావు కదా జాబ్ కావాలంటే అన్ని పక్కన పెట్టి పని చేయాలి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
తరువాత సన్నివేశంలో ప్రేమ్ గిటారు వాయిస్తూ ఉండగా ఇంతలో కాఫీ తీసుకొని శృతి వస్తుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు సరదాగా కామెంట్లు చేసుకుంటారు. తర్వాత ప్రేమ్, సామ్రాట్ గారు ఒక ఈవెంట్లో అవకాశం ఇప్పించారు అని అంటాడు. శృతి కాస్త నవ్వుతూ బాగానే సెటైర్లు వేస్తుంది. మరొకవైపు అనసూయ చిరాకుగా నా మాటను ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం నా పెద్దరికానికి కూడా విలువ ఇవ్వడం లేదు అని బాధపడుతుండగా అక్కడకు అభి వస్తాడు. అభి నానమ్మతో ఏదైనా చేస్తే నువ్వే చేయాలి. పాత అనసూయను గుర్తుచేసుకోమంటాడు. కానీ అనసూయ నేను చెబితే సరిపోదు మీ తాతయ్య కూడా చెబితేనే అందరూ వింటారు అంటే దానికి అభి ఎవరిని చెప్పి ఒప్పేంచాల్సిన అవసరం లేదు మామ్, సామ్రాట్ గారి ఆఫీసుకు వెళ్లకుండా ఉండటానికి నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది అంటే ఆలోచనలో పడుతుంది అనసూయ.
తర్వాత సన్నివేశంలో తులసి సామ్రాట్ గారికి ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ ఉంది అందుకే గుర్తు చేస్తున్నా అంటుంది. అప్పుడు సామ్రాట్, హనీ గుడికి వెళ్దామంటే వెళ్లాను కాస్త లేట్ అవుతుంది వస్తాను అంటూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. తర్వాత సామ్రాట్ ఆఫీసుకు బయలుదేరుతుండగా హనీ స్కూలుకు వెళ్ళనంటే నచ్చజెప్పి స్కూల్ కి పంపిస్తాడు సామ్రాట్. తర్వాత ఆఫీసుకు బయలుదేరుతుండగా ఇంతలో అనసూయ వస్తుంది. అనసూయ, సామ్రాట్ తో మీరు నాకు ఒక మాట ఇవ్వాలి తర్వాత కాదనకూడదు అని మాట తీసుకుంటుంది. సామ్రాట్ ఇంతకీ విషయం ఏంటి అని ప్రశ్నించగా ఇకనుంచి తులసి మీ ఆఫీసుకు రాకుండా మీరే చేయాలి అని అనడంతో ఒక్కసారిగా సామ్రాట్ షాక్ అవుతాడు.
అప్పుడు అనసూయ మీరు డబ్బున్న వాళ్ళు ఎవరు ఏమన్నా మీరు పట్టించుకోరు. మావి మధ్యతరగతి బతుకులు సమాజంతో కలిసి కచ్చితంగా బతకాల్సిందే. అనుమానం వచ్చినా కూడా దోషిలా నిలబడాల్సిందే అంటుంది. అప్పుడు సామ్రాట్ మీరు తులసికు చాలా అన్యాయం చేస్తున్నారు అంటే, అన్యాయం కాదు బాబు నా కోడలు పరువు పోకుండా చూస్తున్నాను అంటూ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Intinti Gruhalakshmi:
తర్వాత సన్నివేశంలో ఒక ఈవెంట్ కు ఆడిషన్ కు వచ్చిన ప్రేమ్ రిజల్ట్ ఏమవుతుందో అని కంగారుపడుతూ కూర్చొని ఉండగా ఇంతలో అటెండర్ వచ్చి ఇక్కడ ప్రేమ్ ఎవరు అని అడిగి మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పడంతో ఎంతో ఆనందిస్తాడు ప్రేమ్. తరువాత ఒకసారి మీతో సార్ మాట్లాడాలి అనుకుంటున్నాడు అంటే లోపలి వెళుతుండగా ఒక వ్యక్తి ఆపే ప్రయత్నం చేయగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.