Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో లాస్య, తులసి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నందు వస్తే పాపం ఇప్పుడు తులసి పరిస్థితి ఏంటో అంటుంది. పక్క వాళ్ళ గురించి మనకెందుకు మన పనులు మనం చూసుకుంటే మంచిది అంటాడు నందు. మరొకవైపు సామ్రాట్ ను మందలిస్తాడు అతని బాబాయి. నీకు మానవత్వం లేదు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. తర్వాత దానిని ఇలా పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఏముంది. తులసి అంత పెద్ద తప్పు ఏం చేసిందని నువ్వు అలా ప్రవర్తించావు. తులసి ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టావు అంటాడు. అందుకు సామ్రాట్ ఫోన్ చేసి సారీ చెప్తా అంటాడు. అందుకు అతని బాబాయి నలుగురిలో పరువు తీసేసి.. ఒంటరిగా ఉన్నప్పుడు సారీ చెప్తే చేసిన తప్పు ఒప్పు అవుతుందా అని అంటాడు. సామ్రాట్ ఇంటికి వెళ్లి అందరి ముందు క్షమించమని అడుగుతానని బయలుదేరుతాడు.
తర్వాత సన్నివేశంలో తులసి ఇంటి వద్ద కాలనీ వాళ్లంతా వచ్చి ఈ దసరాను విడివిడిగా కాకుండా అందరం కలిసి జరుపుకుందాం అంటారు. తులసి సంతోషంగా ఒప్పుకుంటుంది. తర్వాత ప్రేమ్ పండగలు వచ్చాయంటే ఆడవాళ్లంతా నగలు చీరలతో కలకలలాడతారు అంటాడు. అప్పుడు దివ్య వదినకు ఒక మంచి చీర కొనివ్వు దానితోపాటు నాకు కూడా ఒక కాగ్రా కొనివ్వు అంటుంది. అప్పుడు ప్రేమ్ నేనేదో సరదాగా అన్నాను మీరంతా నన్ను టార్గెట్ చేస్తున్నారని అంటాడు. అప్పుడు అంకిత అందుకే ఆడవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. శృతికి సారీ చెప్పమంటుంది. అప్పుడు ప్రేమ్ బైక్ నా నడుము పట్టుకుని కూర్చుంటే చీర కొనిస్తా అంటాడు. అందుకు శృతి పండగ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇదంతా ఎందుకని అంటుంది.
తర్వాత సన్నివేశంలో సామ్రాట్, తులసి ఇంటి వద్దకు వస్తాడు. అనసూయ, సామ్రాట్ ను చూసి ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తుంది. నాకు థాంక్స్ చెప్పడానికే వచ్చావా అని అంటుంది. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో లేదంటే నువ్వు నేను ఇద్దరం తులసి ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. నేనేం చేసినా తులసి ఆత్మాభిమానం గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. అప్పుడు సామ్రాట్ ఒక ఫైల్ తులసి దగ్గర ఉండిపోయింది అది తీసుకెళ్దాం అని వచ్చాను అంటారు. సరే ఆ ఫైల్ నేను తెచ్చిస్తాను అంటూ తులసి వద్దకు వెళ్లి సామ్రాట్ వచ్చాడు ఏదో ఫైల్ నీ దగ్గర ఉందంట కదా ఇస్తే తీసుకెళ్తా అంటుంది.
Intinti Gruhalakshmi:
అప్పుడు తులసి ఆయన ఫైల్ కోసం ఇంత దూరం వస్తే బయటి నుంచే బయటికి పంపించడం మర్యాద అనిపించుకోదు అంటూ.. నేను వెళ్లి ఫైల్స్ ఇచ్చి వస్తాను అంటూ ఫైల్స్ తీసుకుని సామ్రాట్ వద్దకు వస్తుంది. సామ్రాట్ ఏదో పరధ్యానంలో ఆలోచిస్తూ ఉంటే తులసి మీరు ఫైల్స్ కోసం రాలేదు. అయినా ఈ ఫైల్ లో అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు. అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.