Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సామ్రాట్ జరిగిన దాన్ని ఆలోచించుకుంటూ తులసి తన పర్సనల్ విషయాలు నాకెందుకు చెప్పాలి అనుకుందా. లేదంటే కనీసం ఫోన్ చేసిన మాట్లాడొచ్చు కదా ఈ మౌనం భరించడం కష్టంగా ఉంది అనుకుంటూ ఉండగా ఇంతలో తులసి మెసేజ్ చేస్తుంది. కలిసి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాడు సామ్రాట్. కానీ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇంతటితో ఆపేద్దాం అంటూ మెసేజ్ చూసి తన బాబాయ్ దగ్గరికి వచ్చి తులసి చూడు ఎలా చేసిందో అద్దాంతరంగా మ్యూజిక్ స్కూల్ పార్ట్నర్షిప్ ను క్యాన్సిల్ చేసింది. నేను ఏమీ ఆలోచించకుండా తన ప్లాన్ ని ఓకే చేశాను ఏ ప్రాఫిట్ నువ్వు ఆలోచించలేదు ఎంతో పబ్లిసిటీ చేశాను సడన్గా ఇలా నిర్ణయం కరెక్టేనా.
నందు మాజీ భర్త అన్న విషయం దాచింది తను, తప్పు చేసింది తను, సంజాయిసి చెప్పుకోవాల్సింది తను అంటే దానికి బాబాయి అవి తన పర్సనల్ విషయాలు నీకెందుకు చెప్పాలి నీ జీవితంలో కూడా చాలానే ఉన్నాయి కదా అవి నువ్వు తులసికి చెప్పావా అంటూ నిలదీస్తాడు. దానికి దీనికి సంబంధం ఏంటి అంటే నువ్వు మ్యూజిక్ స్కూల్ గురించి ఆలోచిస్తున్నావా లేదంటే తులసి ఇకపై నీ కళ్ళ ముందు కనిపించదు అని బాధపడుతున్నావా, పాపం జరిగిన దానికి ఎంత బాధ పడుతుందో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అంటే ఇంతవరకు చేద్దామని అనుకున్నాను ఇలా మెసేజ్ పెడితే ఏమనుకోవాలి అంటాడు సామ్రాట్.
తరువాత సన్నివేశంలో శృతి బట్టలు కనిపించడం లేదని వెతుకుతుంటే ప్రేమ్ బయటకు తీసుకొచ్చి నీళ్లు పోస్తుంటే శృతి వచ్చి ఏం చేస్తున్నావు అంటే నాతో పాలలో ఉప్పు పోసి తాగించావు ఈ బట్టలు ఉతుకు అంటూ నీళ్లు పోస్తాడు. సరదాగా కాసేపు ఒకరిపై ఒకరు పంచులేసుకుని గొడవపడతారు. సరదాగా బట్టలు ఉతుక్కో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
తరువాత సన్నివేశంలో నందు మనమంచికే జరిగింది అంటూ ఆఫీసుకు రెడీ అవుతుండగా ఇంతలో తులసి వస్తుంది. నందు లాస్యలు వెటకారంగా ఎందుకు వచ్చావని అడగక మనమధ్య ఒక ఒప్పందం ఉంది కదా నా మాజీ భర్త విషయం సామ్రాట్ గారికి చెప్పకూడదు అని దాన్ని అతిక్రమించింది మీరు ఆ విషయాన్ని మీరే సామ్రాట్ గారికి చెప్పాలి అంటుంది. నందు లాస్యలు చాలా వెటకారంగా సామ్రాట్ గారు మొదటిసారి నిన్ను ఫ్లైట్ ఎక్కించారు మొదటిసారి సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు నువ్వు చెప్పిన ప్రపోజల్ ఓకే చేశారు బిల్డింగ్ కూడా అలాగే ప్లాన్ చేశారు ఇన్విటేషన్ కార్డులో నీ పేరు కింద ఆయన పేరు వేయించుకున్నారు నువ్వు చెప్పొచ్చు కదా అంటే నేను చెప్తే నమ్మరు మీరే చెప్పాలి అంటుంది తులసి.
Intinti Gruhalakshmi:
సరే చెప్తాను కానీ ఒక కండిషన్ అంటాడు నందు. సామ్రాట్ గారి కూతురు హనీ యాక్సిడెంట్ చేసింది నేనే అని నువ్వు చెప్పలేదు కదా ఆ విషయాన్ని నువ్వే దాచావని నేను సామ్రాట్ గారికి చెప్తాను ఒక తప్పు చేసిన రెండు తప్పులు చేసినా ఒకటే శిక్ష పడుతుంది అంటాడు. అప్పుడు తులసి మీకు మానవత్వం లేదా మరీ ఇంతలా దిగజారుతారా అంటే నీకు కూడా స్వార్థం ఉంది కదా అంటారు. నేను బిజినెస్ పార్ట్నర్ షిప్ వద్దు అనుకొని సామ్రాట్ గారికి మెసేజ్ పెట్టి నాపై నమ్మకం ఉన్న వాళ్ళ దృష్టిలో నేను చెడ్డదాన్ని కావడం ఇష్టం లేక నిజం చెప్పమని మీ దగ్గరికి వచ్చాను అంటుంది. మీరు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తారని అనుకోలేదు మీ ఇష్టం మీరెలా అనుకుంటే అలాగే చేయండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.