Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సామ్రాట్, నందు, లాస్యలు మేనేజర్ తో కొటేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగా ఇంతలో మేనేజర్ రావు కు ఫోన్ వచ్చి మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. అదే సమయంలో తులసికి కూడా ఫోన్ వచ్చి బయటకు వస్తుంది. అక్కడ మేనేజర్ ఎవరితోనో సామ్రాట్ నన్ను గుడ్డిగా నమ్మేశాడు తెలియకుండా ఆస్తిరాపించుకున్న కనుక్కోలేరు అంత నమ్మకం ఏర్పడింది అంటాడు ఇదంతా తులసి చూస్తుంది. తర్వాత తులసిని నువ్వు కొత్తగా వచ్చావు నా గురించి తెలియదు నీ బిజినెస్ స్కూల్ గురించి మాత్రమే నువ్వు చూసుకో నా సంగతి నీకు తెలియదు అంటూ బెదిరిస్తాడు.
తర్వాత మేనేజర్ లోపలికి వస్తే సామ్రాట్ అతనికి ఫైల్ ఇస్తాడు. ఇంతలో అక్కడికి తులసి వచ్చి ఫైల్ తీసుకుని సామ్రాట్ తో మీ ఉప్పు తిని మీకు ద్రోహం చేస్తే ఏం చేస్తారు అంటుంది. అందుకు సామ్రాట్ నరికి పోగులు పెడతాను అంటాడు. తులసి మీకు ఒకవేళ నమ్మకద్రోహం ఏం చేస్తారు అని అడుగుతుంది అప్పుడు జీవితంలో ఇంకెప్పుడు నమ్మను అంటాడు సామ్రాట్. మేనేజర్ ఫోన్ తీసుకొని అతని నిజస్వరూపం అంతా బయటపెడుతుంది. తరువాత క్షమించండి అంటూ తులసి కాళ్లు పట్టుకుంటాడు మేనేజర్. తులసి మాట విని సామ్రాట్ మేనేజర్ ని విడిచిపెడతాడు.
తర్వాత సామ్రాట్ అందరి ముందు తులసిని జనరల్ మేనేజర్ చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. అప్పుడు తులసి గడ్డిపోచను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు ఉంది మీ నిర్ణయం. నేను మేనేజర్ పోస్ట్ కు అర్హురాలిని కాదు అంటుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు అదే మంచివాళ్ళ గొప్పతనం అంటాడు. అప్పుడు అభి కలుగజేసుకుని ఇంగ్లీషులో సంతకం చేయడానికి కూడా ఇబ్బంది పడతావు అలాంటి నీకు కోట్ల టర్న్ ఆన్ చేసి కంపెనీలు మేనేజర్ గా ఎలా కూర్చోబెడతాడు అని ప్రశ్నిస్తాడు. నిన్ను అవమానించడానికి కాదు మామ్ ఏ అర్హతతో మేనేజర్ పోస్ట్ లో కూర్చోపెడుతున్నారో సామ్రాట్ అని గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడు సామ్రాట్ చదువు టాలెంట్ ఉన్న వ్యక్తిని ఆ సీట్లో కూర్చోబెడితే చూసావు కదా రిజల్ట్ ఎలా ఉందో, కావాల్సింది చదువు, టాలెంట్ ఉన్నవాళ్లు కాదు నమ్మకం ఉన్నవాళ్లు కావాలి అనుకున్నను కాబట్టే తులసి గారిని ఆ పోస్టుకు సెలెక్ట్ చేశాను అంటాడు.
Intinti Gruhalakshmi:
మీ చుట్టూ నమ్మకం ఉన్న వాళ్ళు లేరా నందగోపాల్ గారికి చదువు ఉంది టాలెంటు ఉంది ఆయన ఈ పోస్టుకు అర్హులు కాదా, ఎందుకు తనతో కాదు అంటున్న మామ్ ను ఆ సీట్లో కూర్చోబెడుతున్నారు. తర్వాత తెలియక ఏదైనా పొరపాటు జరిగితే పరిస్థితి ఏంటి అది గట్టిగా మామ్ నిలదీస్తాడు. తర్వాత తులసి మ్యూజిక్ స్కూల్ నా కల అంతవరకే ఉండనివ్వండి ఈ మేనేజర్ పోస్టు వద్దంటుంది. అప్పుడు సామ్రాట్ ఎదగాలి అనుకునే వారికి ఏది సమస్య కాదు వైజాగ్ లో ఒకరే మీటింగ్ అటెండ్ అయ్యి సక్సెస్ చేశారు. అప్పుడున్న తెగింపు, ధైర్యం ఇప్పుడేమయ్యాయి మీ వెంట నేనున్నాను అని భరోస్తా ఇస్తాడు. తర్వాత కుటుంబ సభ్యులు కూడా అందరూ తులసిని ఒప్పుకోమంటే సరే అంటుంది. తర్వాత నందు తో లాస్య కామెంటు చేస్తూ మొత్తం దశావతారాలు చేయించేటట్టున్నాడు అంటుంది. అప్పుడు నందు నేను జాబ్ కు రిజైన్ చేస్తాను అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. పోతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.