Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో నందు, లాస్యతో నేను జాబ్ కు రిజైన్ చేస్తాను. రేపటినుండి తులసి ముందు చేతులు కట్టుకుని నిలబడలేను అంటాడు. అప్పుడు లాస్య తొందరపడకు ఏదైనా అవకాశం వస్తే తులసికి చదువు రాదు కాబట్టి ఏదైనా ప్రాబ్లం లో ఇరికిస్తే అప్పుడు సరిపోతుంది అంటుంది. తరువాత సన్నివేశంలో ప్రేమ్, శృతి, అంకితాలు అభిని పిలిచి మామ్ ను డిస్టర్బ్ చేయొద్దు. మామ్ కు మేనేజర్ పోస్ట్ వచ్చింది కదా ఆమెను కాస్త సంతోషంగా ఉండనిద్దాం అంటే నేనేమైనా కావాలని గొడవ పడుతున్నాడా? నాకు మామ్ అంటే ప్రేమ లేదా అంటాడు అభి.
మీకు మామ్ ఎంతో డాడీ కూడా అంతే కదా మరి ఆ ప్రేమ డాడ్ మీద ఎందుకు చూపించడం లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత అందరూ భోజనం చేయడానికి వస్తే అక్కడ తులసి, లక్కీ, హనీలకు భోజనం తినిపిస్తుంటే అందరూ మాకు కూడా పెట్టాలి అంటే ముద్దలు కలిపి అందరికీ ఇస్తూ హనీ, లక్కి లకు తినిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న సామ్రాట్ ఒక వైపు తులసి ఫ్యామిలీ మరొకవైపు లాస్య ఫ్యామిలీ ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని బాబాయిని అడుగుతాడు. అప్పుడు సంతోషంగా ఉన్న ఫ్యామిలీని పక్కనుండి ఈ సేవ నా ఫ్యామిలీ చూస్తుంది అని పేర్కొంటాడు. ఎందుకు తులసికి ఇలా జరుగుతుంది అంటే నీడనిచ్చే చెట్టుకే నీడ లేకుండా పోవడం అంటే ఇదే అంటాడు.
తరువాత సన్నివేశంలో డాక్టర్ వచ్చి అని చేతికి ఉన్న కట్లు విప్పుతుంది. ఇప్పుడు ఎలా ఉంది అని ప్రశ్నిస్తే చాలా బాధగా ఉంది మీరంతా వెళ్ళిపోతారు కదా ఒక్కదాన్నే ఆడుకోవాలి అంటుంది. తర్వాత సామ్రాట్ ప్రెస్ మీట్ పెట్టాలి అనుకుంటాడు అందుకు తగిన ఏర్పాటు చూడమని నందుకు చెబితే ఇంతలో తులసి ఈ సమయంలో ప్రెస్ మీట్ అవసరమా అంటే మన మీద పడ్డ నిందలు తుడిచేసుకోవాలి కదా అంటాడు. అప్పుడు తులసి కాలికి ముల్లు గుచ్చుకుంటే తీసిపారేసి నడవాలి. తరువాత ముల్లుపై కాలు వేయకుండా జాగ్రత్త పడాలి అంతేగాని ముల్లుపై పగ పెంచుకొని బూడిద చేయాలి అనుకుంటే మన సమయమే వృధా అవుతుంది అంటుంది. అందరూ తులసిని సమర్థిస్తారు. మ్యూజిక్ స్కూల్ ఆగిపోయిందని బయట అందరూ అనుకుంటున్నారు దాని కోసమైనా ప్రెస్ మీట్ పెట్టాలి అంటాడు సామ్రాట్. తులసి కూడా అంగీకరిస్తుంది.
Intinti Gruhalakshmi:
తరువాత నందు, లాస్యతో ఇప్పుడేం అవసరం ప్రెస్ మీట్ అంటూ చిరాకు పడితే దీన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి అంటుంది లాస్య. తర్వాత లాస్య మీడియా వాళ్లకు ఫోన్ చేసి తన ప్లాన్ ఏంటో చెబుతుంది. మరుసటి రోజు మీడియా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను దగ్గరుండి చూసుకొని ప్లాన్ గుర్తు చేస్తూ ఉంటుంది. మరొకవైపు నందు ఏం ప్లాన్ చేసిందో ఏమో అనుకుంటూ ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్ అని లాస్యను అడుగుతాడు. కంగారు పడకు జరిగేదంతా చూస్తూ ఉండు అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపు చూడాల్సిందే.