Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 13వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో భోజనానికి ఏర్పాట్లు చేస్తున్న తులసితో కుటుంబ సభ్యులు సామ్రాట్ గారితో ఓపెన్ గా మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కదా అంటే దానికి తులసి ఈరోజు పండగ సామ్రాట్ గారు మన ఇంటి అతిథి అలాగే మీ నాన్నగారు కూడా అతిథిలాగే ఇంటికి వచ్చారు. నేను ఏదైనా మాట్లాడితే ఇద్దరి మధ్య గొడవ జరిగి పండగ వాతావరణం దెబ్బతింటుంది అంటుంది.
తరువాత అందరూ సరదాగా భోజనం చేస్తుంటే అనసూయ ఒక గ్లాసు పాయసం ఇవ్వమని దివ్య ను అడిగితే ఇవ్వను అంటే బ్రతమాలి ఒక గ్లాస్ తీసుకుంటే అందరూ నవ్వుతారు. లక్కీ తులసితో వినాయకుడికి మాత్రమే ఉండ్రాళ్ళు, లడ్డులు ప్రసాదంలో ఎందుకు పెడతారు అంటే దానికి లాస్య వినాయకుడు బొద్దుగా ఉంటాడు కాబట్టి అంటుంది. అప్పుడు తులసి, లాస్యతో పిల్లలతో ఏ విషయమైనా మనకు తెలిస్తేనే చెప్పాలి లేదంటే తెలుసుకోవాలి అంతే తప్ప అడిగారు కదా అని ఏదో ఒకటి చెప్పకూడదు అంటుంది.
అప్పుడు పరంధామయ్య నీకు తెలిస్తే చెప్పమ్మా అందరూ వింటారు అంటే దానికి తులసి పురాణాల ప్రకారం వినాయకుడు ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తే అక్కడ పంచభక్ష పరమాన్నాలు వడ్డించిన కడుపు నిండలేదు కుడుముతో చేసిన ఒక ఉండ్రాయి తింటేనే కడుపు నిండింది. అందుకే ప్రసాదంగా ఉండ్రాళ్ళు, లడ్డులు పెడతారు అందరికీ అర్థమయిందా అంటే అందరూ సంతోషంగా అర్థమయింది అంటారు. తరువాత చేతులు తుడుచుకోవడానికి సామ్రాట్ కు టవల్ ఇస్తుంది తులసి. అప్పుడు సామ్రాట్ మా హనీ మీ కుటుంబాన్ని ఎందుకు ఇంతలా ఇష్టపడుతుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను ఆరోజు మీ ఇంటికి వచ్చి గొడవ పడకపోయి ఉంటే బాగుండేది అంటే మీ కోపంలో నిజాయితీ ఉంది ఒక కారణం ఉంది అంటే అభి వచ్చి నిజాయితీ లేనిది నీకే నా మామ్ అంటే అంకిత వచ్చి అభిని పక్కకు తీసుకెళ్తుంది.
తర్వాత సామ్రాట్ మేము వెళ్తాము పూజ అయిపోయింది కదా అంటే దివ్య వచ్చి సాయంత్రం సరదాగా ఆడుకుందాం ఉండండి. మరోవైపు లాస్య, నందులు మేము కూడా వెళ్తాం పిలవని పేరంటానికి వచ్చినట్టు ఉంది అంటే ఇంటికి సంబంధం లేని వాళ్లే ఉన్నారు మీరు ఉండడంలో తప్పేం లేదు అంటే ఉండిపోతారు. తరువాత దివ్య సరదాగా సాయంత్రం ఒక బౌల్లో చీటీలు రాసి ఎవరికి ఏ చీటీ వస్తే అందులో ఉండే టాస్క్ చేయాలి అంటుంది. ముందుగా అభి, అంకితలకు చీటీ తీసుకోమంటే ఆ చీటీలో మీ భార్య ఎలా ఉంటే మీకు నచ్చుతుంది అని రాసి ఉంటుంది. అప్పుడు అభి భార్యాభర్తలిద్దరూ ఒకరంటే ఒకరు అర్థం చేసుకోవాలి. ఒకరికి ఒకరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి.
Intinti Gruhalakshmi:
నా భార్య మనసులో నా స్థానం ఏమిటో నాకే తెలియదు అంటూ అంకితకు ఐ లవ్ యు చెప్తాడు. దానికి నందు చాలా ధైర్యంగా మనసులో మాట చెప్పావు ఒక తండ్రిగా నీ మనసులోని కోరిక తీరి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. ఆ తర్వాత దివ్య నేనే స్లిప్ ఇస్తాను అంటూ తీసి నవ్వుతుంటే లక్కీ వచ్చి ఆ చీటీ చూసి మీకు ఇష్టమైన హీరోను ఇమీటేట్ చేస్తూ డైలాగులు చెప్పాలి అని రాసింది అంటాడు. కాసేపు బాలకృష్ణ డైలాగులతో అదరగొడుతుంది దివ్య. అందరూ దివ్యని మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు. తరువాత చిన్నాన్నయ్య టాస్క్ అంటుంది దివ్య. ప్రేమ్, శృతిలు నేను తీస్తా నేను తీస్తా అంటూ గొడవ పడుతుంటే నేను తీసిస్తా అంటూ లక్కీ వచ్చి ఒక చీటీ తీసి ఇస్తాడు. అందులో ప్రేమలో ఉన్న జంట గొడవపడితే ఎలా ఉంటుందో ఆక్ట్ చేసి చూపించాలి అని ఉంటుంది. ఇక శృతి, ప్రేమ్ తో మాట్లాడుతుండగా ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.