Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ ఒకటవ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ప్రేమ్ ఈవెంట్ అడిషన్ లో సెలెక్ట్ అవుతాడు. కానీ అక్కడ ఒక వ్యక్తి అడ్డుపడి నువ్వు నీ టాలెంట్ ద్వారా కాకుండా అడ్డదారిలో సెలెక్ట్ అయ్యావు అని కామెంట్ చేస్తాడు. నేను ఆడిషన్ కు రావడానికి మాత్రమే రికమండేషన్ తీసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ అయింది మాత్రం నా టాలెంట్ తోనే అంటాడు. ఇద్దరి మధ్య మాటకు మాట పెరిగి గొడవ జరుగుతుంది. ప్రేమ్ ఆ వ్యక్తిని కొట్టడంతో సమస్య పోలీస్ స్టేషన్ కు చేరుతుంది. మరొకవైపు మీటింగ్లో సామ్రాట్ డల్లుగా ఉంటాడు. ఏమైంది అని తులసి మెసేజ్ పెడితే ఏం లేదు అని సైలెంట్ గా ఉన్న సమయంలో ప్రేమ్, సామ్రాట్ కు ఫోన్ చేస్తాడు. సామ్రాట్ తో జరిగిన విషయమంత చెప్పి హెల్ప్ చేయమని అంటాడు.
మా అమ్మకు ఈ విషయం చెప్పొద్దండి.. తెలిస్తే చాలా కంగారు పడుతుంది అంటే సామ్రాట్ అలాగే అని, మీటింగ్ లో ఉన్న వాళ్లతో కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఇక పోలీస్ స్టేషన్లో సామ్రాట్ ముందే ఆ వ్యక్తి చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రేమ్ ఆ వ్యక్తిపై గొడవకు దిగితే సామ్రాట్, ప్రేమ్ పై చెయ్యి చేసుకొని ఎస్సై నచ్చజెప్పి బయటకు తీసుకొస్తాడు. తర్వాత సామ్రాట్ నువ్వు హీరో అనుకుంటున్నావా ఎందుకింత ఆవేశం నా గురించి అంత మాట్లాడిన నేను మౌనంగానే ఉన్నాను కదా. నాకు కూడా కోపం వస్తుంది నేను కూడా వాడిని కొట్టగలను అలా చేస్తే న్యూసెన్స్ పెద్దదవుతుంది కానీ పరిష్కారం ఉండదు అంటాడు.
ఈ సమస్య పెద్దదైతే వాడు అన్న మాటలు కోర్టులో గనక చెబితే మీ అమ్మ పరువు ఇంకా పోతుంది. నీవల్ల మీ అమ్మ కష్టాల పాలవుతుంది. ఆల్రెడీ సమాజంలో మా మధ్యన ఏదో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ సమయంలో ఆవేశం పనికిరాదు అంటాడు. అప్పుడు ప్రేమ్ మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ ఎవరేమన్నా నేను తట్టుకోలేను చాలా కోపం వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని మా అమ్మతో చెప్పొద్దండి ఆమె చాలా బాధపడుతుంది. మీరే ఏదో ఒకటి చేసి మా అమ్మ మీద ఇలాంటి నిందలు పడకుండా కాపాడండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు.
తర్వాత కారులో ఆఫీసుకు వస్తూ ఉండగా సామ్రాట్ కు తులసి ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయకపోవడంతో సామ్రాట్ యొక్క బాబాయి మళ్లీ చేయమ్మా. లంచ్ కు వస్తానని చెప్పి కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. రావటం లేదని మెసేజ్ కూడా పెట్టలేదు అంటే మళ్ళీ చేస్తుంది తులసి. అప్పుడు సామ్రాట్ నేను కంపెనీ సీఈఓ ని నాకు చాలా పనులు ఉంటాయి. ఇంకెప్పుడు అనవసరంగా నాకు కాల్ చేయొద్దు అంటూ చిరాకుగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. సామ్రాట్ యొక్క బాబాయి ఉదయం బాగానే ఉన్నాడు కదా అంతలోనే ఏమయింది అంటే ఇందాక ఫోన్ వచ్చింది చాలా టెన్షన్ గా బయటకు వెళ్లారు అని చెబుతుంది.
Intinti Gruhalakshmi:
తర్వాత సన్నివేశంలో అనసూయ ఇంట్లో కూర్చొని తులసి వైపు చూస్తూ సామ్రాట్ నాకు మాట ఇచ్చాడు కదా ఎందుకు తులసికి దూరంగా ఉండే ప్రయత్నం చేయకుంటున్నాడు. ఒకవేళ బయట వార్తలు నిజమేనా లేదా నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా అని అనుకుంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.