Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 27వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ప్రేమ్, శృతిలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఈ ఇంట్లో మగాళ్ళంతా ఆడోళ్ళను అర్థం చేసుకోరు అంటుంది శృతి. నేనేం చేశాను అంటే ముందు మీ నాన్న తర్వాత మీ అన్నయ్య ఇప్పుడు నువ్వు అదే పని చేస్తున్నారు కదా అంటూ ఒకరిపై ఒకరు కలిసిపోయే విధంగా సెటైర్లు వేసుకుంటూ నన్ను వెళ్ళమంటావా అంటే వద్దు వద్దు అంటూ ప్రాదేయపడతాడు ప్రేమ్.
తరువాత సన్నివేశంలో సామ్రాట్, హానీ నీ నిద్ర లేపి కాసేపు కబుర్లు చెప్పుకున్నాక లేట్ అవుతుందంటే నాకు తెలుసు ఈరోజు పూజ ఉంది తులసి ఆంటీ చెప్పింది అంటూ కాసేపు నవ్వుకుంటారు.తర్వాత రెడీ అయ్యి కిందికి వస్తారు బాబాయితో కాసేపు మాట్లాడి అంతా కలిసి టిఫిన్ చేస్తారు.
తరువాత సన్నివేశంలో తులసి కోటకు పూజ చేస్తూ భూమి పూజ బాగా జరిగేలా కరుణించు అంటూ తులసి మొక్కుకోవడం చూస్తున్న అభి కి లాస్య ఫోన్ చేసి భూమి పూజ ను ఎలాగైనా ఆపాలి అంటే అంతా మామ్ వెనకాలే ఉన్నారు. నా మాట ఎవరు వినడం లేదు అంటే దానికి లాస్య అభిని రెచ్చగొట్టి పూజ జరగకుండా ఉండడానికి ప్లాన్ చెబుతుంది. సరే అంటాడు. ఇంతలో నందు వచ్చి ఆనందంగా ఎగురుతున్నావు అంటే ఇదొక రకమైన ఎక్సర్సైజ్ అంటుంది. సరే మ్యూజిక్ స్కూల్ ప్లాన్ పేపర్స్ ఎక్కడున్నాయి సామ్రాట్ తీసుకురమ్మన్నాడు అంటే పూజ జరుగుతుందా అంటే వేరే ఆప్షన్ లేదుగా అంటాడు నందు.ఏమో జరగదేమో నేను కలగన్నాను అంటు టేబుల్ పై ఉంది అని సమాధానం చెబుతుంది.
తర్వాత సన్నివేశంలో నిద్రలేచిన ప్రేమ్, శృతి రెడీ అవుతుండగా చూసి రొమాంటిక్ గా ఏవేవో ఊహించుకుంటూ రేయ్ అంటే ఏమైంది అంటుంది శృతి. అదే పూజకు వెళ్లాలి కదా లేట్ అవుతుంది అంటే ఇప్పుడు నిద్రలేచి పూజ అంటున్నావా ఉదయం లేచి మీ అమ్మకు కాస్త సాయం చేయొచ్చుగా వెళ్లి రెడీ అవ్వు అంటూ టవల్ మొఖంపై విసిరేసి వెళ్తుంది.
Intinti Gruhalakshmi:
తర్వాత సన్నివేశంలో భూమి పూజకు సామ్రాట్ వచ్చి ఇంకా తులసి వాళ్ళు రాలేదా అని అనుకుంటూ ఉండగా ఇంతలో తులసి వాళ్ళు అక్కడికి వస్తారు. తరువాత హనీ పరిగెత్తుకుంటూ తులసీ దగ్గరికి వెళుతుంది. కాసేపు హనీతో తులసి ముచ్చటించాక సారీ అండి కాస్త లేట్ అయింది అంటుంది. లాస్య కలగజేసుకుని ఎదురుచూపులలో చాలా మజా ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తూ పూజకే ఇంతలా అరేంజ్మెంట్స్ చేశారంటే మీ పెళ్లికి ఇంకా ఎంత బాగా చేస్తారో అంటే అందరూ ఒకసారి గా షాక్ అవుతారు. అప్పుడు లాస్య సామ్రాట్ గారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా పెళ్లి ఫిక్స్ అయితే జరిగే పెళ్లి గురించి చెబుతున్నాను అంటూ మేడం మీరు ఇప్పుడు గెస్ట్ కాదు హోస్ట్. మీరు రాకపోతే ముందు ఏమైందో అని తర్వాత టెన్షన్ పడతారు అంటుంది లాస్య. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.