Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్లో పరంధామయ్యను తులసి లోపలికి తీసుకొని వెళుతుంది. ఇక పరంధామయ్య బాధను చూసి సామ్రాట్ మరింత బాధపడతాడు. నీ వయసులో ఇన్ని మాటలు ఎలా అన్నారు అంటూ చాలా అవమానంగా పరిచారు అంటూ బాధపడతాడు సామ్రాట్. ఇక ఆయన పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత.. ఆయన పెదాల మీద చిరునవ్వు పూజించేలా చేస్తాను అని తులసి అంటుంది.
అనసూయ ఇంటికి చేరుకోగానే అక్కడ కూడా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఇక లాస్య అదంతా చూసి ఇవిటికి నిజంగా పిచ్చెక్కిందా అని అనుకుంటుంది. ఇక తన మనసులో నందు కి కుటుంబం మొత్తం మంచిగా చూసుకుంటాను అని మాట ఇచ్చాను అని.. కానీ ఇప్పుడు ఇదంతా జరిగింది అని అనుకుంటుంది. ఈ విషయం నందు కు తెలిస్తే నందు కూడా పిచ్చెక్కిపోతాడు అని అనుకుంటుంది.
ఇక నందు వచ్చే వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అని అనుకుంటుంది. అంతేకాకుండా పరంధామయ్యను ఇంటికి తీసుకొచ్చేలా చేయాలని అనుకుంటుంది. ఆ తర్వాత పరంధామయ్య నిద్రలో కూడా తను పనికిమాలిన అంటూ కలవరిస్తూ ఉంటాడు. అది చూసి తులసి చాలా బాధపడుతుంది. ఆయనకేం కాకూడదు అని అనుకుంటుంది. కట్టుకున్న భార్య అందరి ముందు పరువు తీసింది అని మరింత బాధపడుతుంది.
ఇక తులసి బాధపడటానికి చూసి సామ్రాట్ ఓదార్చుతాడు. ఇక తులసి తనకు తన అత్తయ్య మీద చాలా కోపంగా ఉంది అని.. ఎప్పటికీ ఈ గొడవను మర్చిపోలేను అని అంటుంది. ఇక సామ్రాట్ కూడా చాలా అసహ్యంగా మాట్లాడింది అని అంటాడు. విషయం నందు కి తెలిస్తే మరింత తీవ్రంగా ఉంటుంది అని అంటారు. ఇక తులసి కూడా నందుకి ఈ విషయం తెలిస్తే అసలు తట్టుకోలేరు అని అంటుంది.
మంచి భర్త కాకపోయినా మంచి కొడుకు అని, మంచి తండ్రి అని నందుని పొగుడుతుంది. మరోవైపు అనసూయ మాత్రం అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక తన నాన్నమ్మ ప్రవర్తన చూసి దివ్య భయపడుతుంది. తాతయ్యని ఎన్నెన్ని మాటలు అన్నదని అంటుంది. ఇక ప్రేమ్ వెళ్లి నేను కనుక్కుంటాను అని అంటాడు. వెంటనే అభి ఆపే ప్రయత్నం చేస్తాడు.
ఇక తను చేసిన తప్పు తనకు తెలియాలి కదా అని ప్రేమ్ అనడంతో వెంటనే అభి ఆవిడ ఏం తప్పు చేసింది అని వెనుకేసుకొస్తాడు. ఆమె చేసింది కరెక్టేమో కదా అని అంటాడు. ఆ తర్వాత శృతి కూడా నేను వెళ్లి నానమ్మతో మాట్లాడుతాను అని అంటుంది. అందరూ అనుసే దగ్గరికి వెళ్ళగా అనసూయ మరింత పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ప్రవర్తన బాలేదు అంటూ మీ వల్ల తాతయ్యను దూరం చేసుకుంటున్నారు అని శృతి అంటుంది.
Intinti Gruhalakshmi:
దాంతో అనసూయ ఈ నీతులు మీ తాతయ్యకు ఎందుకు చెప్పలేదు అని.. నువ్వు చెప్పే మాటలు వినడానికి ఇక్కడి నుంచి కాదు లోపలికి వెళ్ళిపో అని పొగరుగా అంటుంది. మరోవైపు పరంధామయ్య నిద్రలో తుళ్ళిపడటంతో తులసి ఏం కాదు అని ధైర్యం ఇస్తుంది. ఇక పరంధామయ్య మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు.