Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో నందు నిద్రలోంచి ఉలిక్కిపడి తులసి అని అరుస్తాడు. ఇంతలో లాస్య వచ్చి నీ మాజీ భార్య కలలో వచ్చిందా అంటూ అడిగితే అదేం లేదు అంటాడు. తరువాత నందు, అభి కి ఫోన్ చేసి తులసి గురించి తెలుసుకుంటాడు. తులసి అయితే సేఫ్ గానే ఉంది మరి సామ్రాట్ పరిస్థితి ఏంటో అని కాస్త కంగారు పడుతుంటాడు నందు.
తరువాత సన్నివేశంలో తులసి, సామ్రాట్ కు ఫోన్ చేసి ఇంకా రాలేదని అడుగగా కాస్త ఆఫీసు నుండి ఫోన్ వస్తే మాట్లాడుతున్న, ఇప్పుడే బయలుదేరుతున్న అని అంటూ ఉండగా ఇంతలో హనీ వచ్చి స్కూల్ దగ్గర డ్రాప్ చేయమంటే కాస్త పని ఉందమ్మా అంటాడు సామ్రాట్. తర్వాత హనీ, తులసి తో మాట్లాడి మీరైనా చెప్పండి ఆంటీ అంటే సరే అంటున్నావు కొని సామ్రాట్ హనీ ని కారులో స్కూలుకు తీసుకువెళ్తుండగా హనీ కార్ స్పీడ్ పెంచమని చెబితే సామ్రాట్ స్పీడ్ గా తోలుతూ బ్రేక్ వేస్తే బ్రేక్ పడకపోవడంతో బ్రేక్ ఫెయిల్ అయ్యిందని ఇప్పుడు ఏం చేయాలో అని కంగారు పడుతుంటాడు. మరొకవైపు నందు నేను సామ్రాట్ కారు బ్రేక్స్ తీసినట్టు లాస్యకు తెలిస్తే ఏమంటుందో ఏమో అని టెన్షన్ పడుతుంటాడు.
తరువాత సన్నివేశంలో సామ్రాట్ కారు చెట్టుకు తగిలి ఈ యాక్సిడెంట్ అయితే తులసికి ఫోన్ వస్తుంది సామ్రాట్ గారికి యాక్సిడెంట్ అయింది అని, మరొకవైపు నందుకు కూడా ఫోన్ వచ్చి కారులో హనీ కూడా ఉందన్న విషయం తెలిసి చాలా బాధపడతాడు. అందరూ హాస్పిటల్ కు వచ్చి డాక్టర్ ను అడగగా ప్రాణాపాయం తప్పింది. కాస్త ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పడంతో తులసి, బాబాయి ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత సామ్రాట్ లేచి అని ఎక్కడ ఉంది అని బాధపడుతు హాస్పిటల్లో అటు ఇటు తిరిగి ఐసీయూ వద్ద చూస్తే హనీ కనిపిస్తుంది.
Intinti Gruhalakshmi:
తన బాబాయితో చూడు ఎలా ఉందో అంత నా వల్లే జరిగింది. నేను కారులో తీసుకురాకుండా ఉంటే ప్రమాదం తప్పేది కదా అంటూ చాలా బాధపడతాడు. తర్వాత డాక్టర్ వచ్చి మరేం పర్వాలేదు చెయ్యి కాస్త బెనికింది. సృహలోకి వచ్చాక ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అని చెబుతుంది. తరువాత హరిణి చూస్తూ బాధపడుతుంటే తులసి, లాస్యలు ఓదార్చి మీరు ధైర్యంగా ఉంటేనే హనికి ధైర్యం చెప్పగలరు. ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండడం చాలా అవసరం అని చెబుతుండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.