Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో లాస్య ఇంటి పేపర్లను ఎవరికి కనిపించకుండా దాస్తుంది. అదే సమయంలో అక్కడికి నందు వచ్చి ఏంటి అని అడుగుతాడు. దాంతో జాబ్ కి రెజ్యూమ్ అని అంటుంది లాస్య. ఈ రోజుల్లో ఫిజికల్ గా
రెజ్యూమ్ ఎవరు తీసుకుంటున్నారు అని అనుమానంతో అడుగుతాడు నందు. ఇక సరే కానీ అమ్మ ఏది కనిపించట్లేదు అని అంటాడు. రూమ్ లో ఉన్నారేమో అని లాస్య అంటుంది.
ఆ తర్వాత అమ్మను చూడాలంటే బాధగా ఉంది అని అంటాడు నందు. ఎందుకంటే నాన్న ఇప్పుడు అమ్మను ఇష్టపడటం లేదు కదా అని అంటాడు. నాన్నకు కాఫీ ఇచ్చావా అని అడగటంతో ఆయన అడగలేదు అని అంటుంది లాస్య. దాంతో నందుకు కోపంతో ఆయన ఎవరిని అడగరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమే చేసుకోవాల్సింది అని అంటాడు.
దాంతో లాస్య తన మనసులో దీనికే ఇంత కోపం చూపిస్తే ఇంటి పేరు మార్చాను అని తెలిస్తే ఇంకెంత ఉంటుందో అని అనుకుంటుంది. మరోవైపు శృతి మౌనంగా ఉండటంతో ప్రేమ్ ఏం జరిగింది అని అడుగుతాడు. దాంతో శృతి ఆనందంగా ఉండటానికి ఏం కారణం ఉంది అని బాధపడుతూ మాట్లాడుతుంది. ఏం చేయ బుద్ధి కావట్లేదు అని అంటుంది.
ఇక అత్తయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది. దాంతో ప్రేమ్ బాధపడాలో సంతోషించాలో తెలియటం లేదు అని అంటాడు. అలా కాసేపు తులసి ధైర్యం గురించి మాట్లాడుకుంటారు వీరిద్దరూ. మరోవైపు తులసి అద్దె ఇల్లు కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక రూమ్ దొరికాక తను సింగిల్ అని ఆ ఇంటి ఓనర్ కి తెలుస్తుంది. సింగిల్ ఉమెన్ కి ఇల్లు ఇవ్వను అని అంటుంది ఆమె.
అంతేకాకుండా ఆమె ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటంతో తులసి కూడా తనపై కౌంటర్ ఇస్తుంది. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి అంటూ తనకు గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది తులసి. ఇక దివ్య తన తాతయ్యకు టాబ్లెట్లు ఇవ్వటానికి తికమక పడుతుంది. టాబ్లెట్లు వేసుకోవడం మానేయకండి అంటూ సలహాలు ఇస్తుంది.
దాంతో పరంధామయ్య వేసుకుంటాను అని అంటాడు. తర్వాత తులసి గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. ఇక తులసికి ఎవరు ఇల్లు అద్దెకివ్వరు. అప్పుడే సామ్రాట్ ఫోన్ చేసి సింగిల్ గా ఉన్నారా మాట్లాడొచ్చా అని అనటంతో వెంటనే సింగిల్ అనే పదం విని కోపంతో మాట్లాడుతుంది తులసి. ఆ తర్వాత కొన్ని డైలాగులు కొడుతుంది. ఇక సామ్రాట్ మీరు బాధపడకండి రేపు నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి ఇల్లు వెతుకుదాం అని ధైర్యం ఇస్తాడు.
Intinti Gruhalakshmi:
ఆ తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు. ఇక లాస్య మధ్యలో పుల్లలు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంకిత అంటుంది. దాంతో భోజనం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అంటుంది లాస్య. ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరు గొడవ పెడతారో అందరికీ తెలుసు అంటూ శృతి లాస్యను ఉద్దేశించి అంటుంది.