Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సామ్రాట్, నందుతో నువ్వు జీవితంలో చాలా కోల్పోయావు. ఇది వేరే వాళ్లకు అదృష్టంగా మారొచ్చు. నువ్వు తప్పు చేశావు అని అంటే దానికి, నందు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అంటాడు. దానికి సామ్రాట్ అవును కదా నీకెందుకు చెప్తున్నాను అంటూ ఉండగా తులసి, లాస్యలు వస్తారు. ఇక్కడ వర్క్ చూసుకో అని చెప్పి అక్కడి నుండి సామ్రాట్, తులసిలో వెళ్ళిపోతారు.
తరువాత సన్నివేశంలో ఫుల్ గా మందు తాగి రోడ్డ పక్కన నిలబడి సామ్రాట్ ను చిరాకుగా తిట్టుకుంటాడు. తులసి నా జీవితంలో నుంచి వెళ్ళినందుకు తన లైఫ్ కష్టాల్లో ఉంది నా లైఫ్ బాగా ఉంది అనుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటాడు. అప్పుడు సామ్రాట్, తులసి తో మీ వ్యక్తిత్వం చాలా గొప్పది. మీకు కుటుంబం పట్ల బాధ్యత, మీకు ఎదగాలి అన్న పట్టుదల అన్ని నాకు నచ్చాయి. మీ ఎదుగుదలకు నేను కారమైనందుకు సంతోషిస్తున్నాను.
మీ జీవితంలో సగభాగం కావాలనుకుంటున్నాడు అంటాడు. తర్వాత సామ్రాట్ మందు సీస విసిరితే అక్కడ ఎవరూ ఉండరు అదంతా భ్రమ అనుకుంటాడు. కాస్త దూరం వెళ్ళాక కారు ట్రబుల్ ఇస్తే, మెకానిక్ వచ్చి రిపేరు చేస్తాడు. తర్వాత మెకానిక్ తో సామ్రాట్ కారు బ్రేకులు తీసే ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా అంటే నాతో కాదని ఆ మెకానిక్ వెళ్ళిపోతాడు. తరువాత సామ్రాట్ ఇంటికి వెళ్లి కార్ బ్రేక్స్ తీసేసి నువ్వు వెళ్ళేది తులసి ఇంటికి కాదు హాస్పిటల్ కి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
తరువాత సన్నివేశంలో సామ్రాట్ కారుతీస్తుండగా ఇంతలో తులసి వస్తుంది. అప్పుడు సామ్రాట్ ఇదేంటండి నేను మిమ్మల్ని పిక్ అప్ చేసుకుంటాను అని చెప్పాను కదా అంటే మీటింగ్ కు ఇటువైపే వెళ్లాలి కదా మళ్లీ మీరు నా దగ్గరికి వచ్చి పికప్ చేసుకోవడం ఎందుకని ఆటోలో నేనే వచ్చేసాను అంటూ కాసేపు నవ్వుకొని కారులో బయలుదేరుతారు. సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలో బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తే బ్రేక్ పడక సామ్రాట్ కంగారు పడుతుంటే ఏమైందని ప్రశ్నిస్తుంది తులసి.
Intinti Gruhalakshmi:
ఇంతలో కారు ఒక స్తంభానికి గుద్దుకుంటే వెంటనే నిద్రలోంచి ఉలిక్కిపడి తులసి అని అరుస్తాడు నందు. ఇంతలో లాస్య వచ్చి ఏమైంది ఎందుకు తులసి అని అరిచావంటే కాదు నేను లాస్య అని అన్నాను అంటూ కవర్ చేసుకుంటారు. అప్పుడు లాస్య నీకేమైనా తులసి కలలో వచ్చిందా అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.