Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో లాస్య నందు దగ్గరికి వెళ్లి వెటకారంగా మాట్లాడటంతో నన్ను చిరాకు పడతాడు. ఇక నీ పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక లేదు అంటూ నేను బాంబే వెళ్తున్నాను అని అంటాడు. ఇంత సడన్గా ఏంటి అని లాస్య అడగటంతో జాబ్ కన్సల్టేషన్ కు సంబంధించిన మీటింగ్ అని అంటాడు.
ఇంట్లో ఈ ఈ పరిస్థితి ఉంది అని ఇప్పుడు అవసరమా అన్నట్లు లాస్య అడగటంతో.. నేను వెళ్ళాలి అంటూ వచ్చేవరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని.. ముఖ్యంగా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు. ఇక అదే విషయాన్ని తన తల్లితో కూడా చెబుతాడు.
అనసూయ కూడా ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవటం మంచిది కాదేమో ధైర్యంగా ఉండదేమో అని అంటుంది. దాంతో నందు ఇక్కడ ఉండి నేనేం చేస్తాను చెప్పు అని.. నేను ఎంత చెప్పినా నాన్న వినడం లేదు కదా అని అంటాడు. వెంటనే లాస్య మధ్యలోకి కలుగ చేసుకొని ఇదంతా అ తులసి వల్ల జరిగింది అని అంటుంది.
దాంతో నందు ఇప్పుడు గొడవలేవి పెట్టుకోకండి అంటూ.. నాన్న ఇప్పుడు చాలా డిస్టర్బ్ గా ఉన్నారు.. ఆయనను ఎవరు ఇబ్బంది పెట్టకండి అని అంటాడు. ఇక తన తల్లితో కూడా.. నీ మాటలు అదుపులో పెట్టుకొని.. ఆయనను ఇబ్బంది పెట్టేలా మాట్లాడకు అని.. తులసి గురించి మనకు అనవసరం అంటూ మాట్లాడుతాడు.
ఇక అక్కడే ఉన్న అభి తాతయ్యకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని అంటాడు. ఆ తర్వాత లాస్య తులసిని కూడా వదిలేయమంటున్నాడు ఏంటి అని అనటంతో.. వెంటనే అనసూయ ఇంట్లో గొడవలు అన్నింటికి కారణం ఆ తులసినే.. దాన్ని వదిలే ప్రసక్తి లేదు అంటూ కోపంగా అంటుంది. మరోవైపు సామ్రాట్తులసి ఇంటికి బయలుదేరుతుండగా తన బాబాయ్ దేవుడు నీకు ఎప్పుడూ అన్యాయం చేయడు అని ధైర్యంగా వెళ్ళమని అంటాడు.
ఇక పరంధామయ్య ఇంట్లోకి వస్తుండగా అనసూయ పలకరిస్తుంది. దాంతో పరంధామయ్య మాట్లాడటానికి ఇష్టపడడు. అంతేకాకుండా కోపంగా సమాధానాలు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక సామ్రాట్ తులసి ఇంటికి బయలుదేరుతుండగా తులసి దారిలో కనిపిస్తుంది. మొదట తులసి తనపై కోపంగా రియాక్ట్ అవుతుందని భయపడతాడు.
కాని తులసి సామ్రాట్ ని అర్థం చేసుకుని మాట్లాడుతుంది. మీరు నాకోసం గట్టిగా నిలబడి మాట్లాడారు అంటూ.. మీ ఫ్రెండ్ షిప్ ని ఎప్పటికీ వదులుకోను అంటూ మీ ప్రాజెక్టును కూడా వదులుకోను అని అంటుంది. దాంతో సామ్రాట్ సంతోషపడతాడు. అంతేకాకుండా ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు.
Intinti Gruhalakshmi:
ఇక పరంధామయ్య ఇంట్లోకి రాగానే అందరూ సైలెంట్ అయిపోతారు. ఏదైనా గొడవ జరిగిందా అని పరంధామయ్య అడగటంతో.. వెంటనే ప్రేమ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అభి ఆపుతాడు. ఇక పరంధామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అభి ఎందుకు అన్ని తాత చెప్పి ఇబ్బంది పెట్టడం అని కోపంగా మాట్లాడుతాడు. దాంతో ప్రేమ్ కూడా గట్టిగానే సమాధానం ఇస్తాడు. ఇక తులసి సామ్రాట్ కోసం కాఫీ చేసి ఇస్తుంది. ఇక సామ్రాట్ ఇందులో అమృతం కలిపారా అంటూ డైలాగు కొడతాడు.