Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్లో నందు తన తండ్రి పుట్టిన రోజు గురించి ఆలోచనలో పడతాడు. అదే సమయంలో అనసూయ మీ నాన్నగారు ఏంటి ఇంత మూర్ఖంగా తయారయ్యారు అని అంటుంది. దాంతో నందు ఒక కొడుకుగా ఆయన బర్త్డే చేయకపోతే ఎలా అని అంటాడు. ఇక అక్కడికి మాధవి వచ్చిఅనసూయ ను తులసి విషయం గురించి గట్టిగా అడుగుతుంది.
దాంతో నందు ఎందుకలా అంటున్నావ్ నాకంటే నీకు మీ వదిననే ఎక్కువ అయ్యిందా అని కోపంగా అంటాడు. దాంతో మాధవి నువ్వు చేస్తే లేని తప్పు తను చేస్తే ఎలా వస్తుంది అని గట్టిగా అడుగుతుంది. భార్య ఉండగానే ఇంకొక ఆవిడతో ఎఫైర్ పెట్టుకున్నావు.. అలాంటిది వదిన మీద ఎలా కోపం చూపిస్తున్నావు అని అంటుంది. ఒక అనసూయతో నీ కొడుకు చేస్తే రాని తప్పు నీ కోడలు చేస్తా వచ్చిందా అని గట్టిగా అడుగుతుంది.
అప్పుడే లాస్య మధ్యలో వచ్చి అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా అనడంతో.. వెంటనే మాధవి నువ్వు నాకు పద్ధతుల గురించి చెప్పకు అని కౌంటర్ వేస్తుంది. ఇక నందు కూడా ఎంత మాట్లాడినా మాధవి మాత్రం మనసులో మాటలన్నీ బయటికి పెడుతుంది. ఇక ఓవైపు సామ్రాట్ తులసి కోసం ఇల్లు ఏర్పాట్లు చేస్తాడు. కానీ ఆ విషయం తులసికి తెలియకుండా చేస్తాడు.
తులసి తో ఇల్లు నచ్చిందా అనటంతో.. ముందు ఇంటి ఓనర్ కు నేను నచ్చాలి అంటుంది సరదాగా. ఇక సామ్రాట్ మీకు ఈ ఇల్లు దొరుకుతుందని నాకు అనిపిస్తుంది అనటంతో అప్పుడే ఆ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి మాట్లాడుతాడు. ఇక మీకు ఒక విషయం చెప్పాలి అని తులసి అంటుంది. నేను సింగిల్ అని ఇతను నా ఫ్రెండ్ అప్పుడప్పుడు వస్తుంటాడు అని.. అప్పుడప్పుడు నా కొడుకు కూడా వస్తుంటాడు అని అనటంతో ఆమె ఓకే అంటుంది.
ఇక కాసేపు ఓనర్ తో సామ్రాట్, తులసి సరదాగా మాట్లాడుతుంటారు. మరోవైపు మాధవి తన తల్లిపై విరుచుకుపడుతూ ఉంటుంది. మధ్యలో నందు వచ్చి మీ వదిన అది చేసింది ఇది చేసింది అంటున్నావ్.. మరి నేను నీకోసం చేసింది గుర్తుకు లేదా అని గతంలో తన చెల్లికి తీర్చిన బాధ్యతలు గురించి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత.. నందు తన చెల్లితో నీకు తల్లి, అన్న లేడు అనుకొని ఇక్కడి నుంచి వెళ్ళు.. వెళ్లేటప్పుడునీకోసం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి అప్పజెప్పు అని అంటాడు.
Intinti Gruhalakshmi:
ఇంకా ఆ మాటలకు షాక్ అవుతుంది మాధవి. వెంటనే అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు అని కోపంగా మాట్లాడుతుంది. తల్లితో కూడా తొమ్మిది నెలలు మోసి కన్నావు కదా దానికి ఏమైనా ఖర్చు అయ్యిందా అని గట్టిగా అడుగుతుంది. ఓ వైపు తులసి ఇళ్ళు దొరకడంతో సంతోషపడుతుంది. దాంతో సామ్రాట్ ఆమె ఆనందాన్ని చూసి సంతోషపడతాడు. అంతేకాకుండా ఒక గిఫ్ట్ తెచ్చాను అని అంటాడు. దాంతో తులసి ఆశ్చర్యంగా చూస్తుంది.