Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో అందరూ సరదాగా చీటీలతో టాస్క్ ఆడుతుండగా ప్రేమ్, శృతిలకు నిజమైన ప్రేమికులు గొడవపడాలి అని ఉంటే వాళ్లు అక్కడ ఉన్నారని మర్చిపోయి సీరియస్ గా ఒకరిపై ఒకరు గొడవపడతారు. తరువాత గొడవ మరింత పెరిగితే తులసి ఆపుతుంది. ఏం జరుగుతుందంటే టాస్క్ చేశామని చెప్పి కూర్చుంటారు. తర్వాత పరమానందయ్య తీసిన చీటీలో డాన్స్ చేయాలి అని రాసి ఉంటే భార్యాభర్తలిద్దరూ డాన్స్ చేస్తారు. తరువాత నందు, లాస్యలకు రొమాంటిక్ పాటకు డ్యాన్స్ వేయాలి అని చీటీ వస్తే డాన్స్ చేస్తుంటే తులసి కాస్త గిల్టీగా ఫీల్ అవుతుంది.
తర్వాత తులసికి వచ్చే టాస్క్ చీటీలో ఒక మధురమైన పాట పాడాలి అని ఉంటుంది. తన జ్ఞాపకాలను అంత ఒక పాట లాగా పాడుతుంది. తరువాత లక్కీ, సామ్రాట్ తో మనం డాన్స్ చేద్దామా అంటే దివ్య ఇది టాస్క్ లోకి రాదు అంటే పర్లేదు అని ఇద్దరు డాన్స్ వేస్తారు. తర్వాత సామ్రాట్ చీటి తీస్తే అందులో మీకు నచ్చిన కథ చెప్పాలి అని వస్తుంది. లాస్య ఇది విని నందుతో కామెంట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు నా విజ్ఞాలనీ తొలగిపోయిన రోజు. నా కళ్ళు ఆ వినాయకుడు తెరిపించిన రోజు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఒక బాస్ కథ చెప్తా అంటాడు.
బాస్ అనే వాడు తన దగ్గర ఉద్యోగం చేసే వాళ్ల గురించి మంచి, చెడ్డలు తెలుసుకోవాలి. వాళ్లకి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చాలి. ఒక్కోసారి ఎవరో చెప్పింది నమ్మి, కళ్ళతో చూసింది నిజమని నమ్మకూడదు. అటువంటి బాస్ గుడ్డివాడు, చెవిటివాడు. అటువంటి బాస్ కనపడితే చెంప పగలగొట్టాలి. తన పార్ట్నర్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. తను మాజీ భర్త అన్న విషయం ఆఫీసులో తెలియకూడదు అని పార్ట్నర్ తో మాట తీసుకుంటాడు ఆ మాజీ భర్త. ఆ పార్ట్నర్ జాలితో ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. నిందను భరించింది, ఆగడాలను సహించింది, తన మాజీ భర్త గురించి బయట పెట్టలేదు.
Intinti Gruhalakshmi:
ఆ మాజీ భర్త ఆమె కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరిన తప్పులేదు అంటే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత నందు, లాస్యలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ బాస్ తరపున నేను ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటాడు. తరువాత క్షమించి రేపు ఆఫీసుకు రండి తులసి గారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంత త్వరగా నా మనసులో భారాన్ని తీసేస్తామని అనుకోలేదు అంటూ వినాయకుడిని మనసారా దండం పెట్టుకుంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.