Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో అనసూయ ఒంటరిగా కూర్చుని నేను చెప్పిన పని సామ్రాట్ ఏం చేసింటాడు. అసలు నా మాటకు విలువ ఇస్తున్నాడా లేదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అభి అక్కడకు వస్తాడు. అనసూయతో ఏంటి నానమ్మ ఏదో చేస్తాను అన్నావు అంటే నేను చేయాల్సింది చేశాను. ఫలితం కోసం ఎదురుచూస్తున్నాను. కానీ తులసి మీ నాన్నతో ఉన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించింది ఇప్పుడు మా కోసం ఆ కష్టాలు పడుతుంది అంటూ కాస్త బాధపడితే మాట నిలుపుకోవడం ముఖ్యం కదా అంటాడు అభి. ఇంతలో అక్కడికి తులసి దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే అభి నానమ్మ కీళ్లనొప్పుల గురించి అంటాడు.
తరువాత సన్నివేశంలో సామ్రాట్ ఆఫీసులో తులసి ఫైళ్ళ మీద సంతకాలు చేస్తూ ఉంటుంది. తన వద్ద పని చేసే అసిస్టెంట్ సామ్రాట్ చెక్ చేయని ఫైల్ మీద కూడా సంతకం చేయిస్తుంది. తర్వాత కాసేపటికి నందు ఆ ఫైల్ తీసుకొని వచ్చి తులసిని గట్టిగా నిలదీస్తాడు. ఫైల్ పై సంతకం చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలని తెలియదా ఇది పాత ప్రాజెక్ట్ పెండింగ్ ఫైల్.. నువ్వు గుడ్డిగా సంతకం చేశావు నేను గనక చూడక పోతే దాదాపు పది కోట్లు నష్టం వచ్చేది అంటాడు. ఇంతలో అక్కడికి సామ్రాట్ వస్తే నందు ఏదో చెప్పబోతుండగా నేను అంతా విన్నాను అంటాడు. ఇంతలో లాస్య కలగజేసుకొని పాత మేనేజర్ నమ్మకంగా లేడనే కదా నిన్ను నమ్మి ఆ సీట్ లో కూర్చోబెట్టారు అని కామెంట్స్ చేస్తుంది.
తర్వాత సామ్రాట్ నేను చెక్ చేయని ఫైల్ మీద సంతకం ఎలా పెట్టారు.. ఫైల్ మీ దగ్గరికి ఎలా వచ్చిందని తులసిని ప్రశ్నిస్తాడు. తులసికి గుర్తు వచ్చి ఇదంతా అసిస్టెంట్ చేసిందని గ్రహించి మౌనంగా ఉంటుంది. ఇంతలో సామ్రాట్ బాబాయి క్యాబిన్లో వెళ్లి డిస్కస్ చేద్దామంటే అవసరం లేదు ఏదైనా ఇక్కడే మాట్లాడదాం. తులసి తప్పు చేయలేదు అని చెబితే అప్పుడు ఆలోచిద్దాం అంటాడు. తర్వాత తులసి సామ్రాట్ గారికి క్షమాపణ చెప్పి ఇలాంటి పొరపాటు మళ్లీ జరగదు అంటే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. తరువాత సామ్రాట్ ఇదంతా మనసులో పెట్టుకొని సాయంత్రం హనీ బర్త్డే పార్టీకి రాకుండా ఉండవద్దు. మీరు రాకపోతే హనీ బర్త్డే జరగదు అని తులసికి చెప్తాడు.
తర్వాత సన్నివేశంలో అనసూయ సాయంత్రం పార్టీకి వెళ్లాలి కదా అని ఏ చీర కట్టుకోవాలో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అభివచ్చి నానమ్మ నువ్వు ఏం చెప్పావు ఏం చేస్తున్నావు నాకేం అర్థం కావడం లేదు అంటే నీలాగా నేను ఎవరో మాటలు విని ప్రవర్తించను నాకు నచ్చింది చేస్తాను నువ్వు కూడా పార్టీకి రమ్మని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది.
Intinti Gruhalakshmi:
తర్వాత సన్నివేశంలో తులసి తన అసిస్టెంట్ తో ఎందుకిలా చేశావు నువ్వే చేశావా లేదంటే ఎవరైనా చెప్తే చేసావా నీ జాబుకు నేను గ్యారెంటీ సామ్రాన్ గారు ఫైల్ చెక్ చేశారని చెప్పే కదా నాతో సంతకం చేయించుకున్నావు అని అసిస్టెంట్ను నిలదీస్తుంది. ఇదంతా పక్కనుండి చూస్తున్న లాస్య కంగారు పడుతుండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.