Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో లాస్య, నందుతో మాజీ భర్త అన్న విషయం తులసి, సామ్రాట్ గారితో చెప్పి ఉంటుంది. లేకపోతే ఆయనకు తెలిసే ఆస్కారమే లేదు అంటే దానికి నందు తులసి చెప్పిందని కచ్చితంగా చెప్పలేము, ఇక ఆఫీస్ కు మనకు నూకలు చెల్లినట్లే అంటే అప్పుడు లాస్య ఇలా చేస్తే మనం జీవితంలో ఓడినట్టే అవుతుంది అంత తేలిగ్గా నేను ఓటమిని ఒప్పుకోను ఏదో ఒక బ్రహ్మహస్తం వేస్తాను అంటుంది.
తరువాత సన్నివేశంలో సామ్రాట్ ఇక తులసి ఆఫీస్ కు రాదేమో బాబాయ్ అనుకుంటూ బయటికి వస్తే అక్కడ తులసి కనపడి సంతోషిస్తాడు. తులసి తో సామ్రాట్ మాట్లాడుతుండగా ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. సామ్రాట్ ఫోన్ చేసి వచ్చి ఉంటే బాగుండేది కదా అంటే మా జాబ్స్ గురించి మాట్లాడాలి అందుకోసమే వచ్చాను అని చెబితే సరే నా క్యాబిన్లో వెయిట్ చెయ్యి తులసి గారితో మాట్లాడిన తర్వాత నీతో మాట్లాడతాను అంటాడు.
తరువాత సామ్రాట్ మీకు నందు చాలా అన్యాయం చేశాడంటే ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు వదిలేయండి అని చెబుతుంది. లాస్య, నందులను జాబ్ లో నుండి తీసేద్దాం అనుకుంటున్నా, ఈ విషయంలో మీరేమంటారు అంటే తులసి మౌనంగా ఉంటే సామ్రాట్, లాస్యను మళ్లీ రమ్మంటాను మీరు ఆలోచించి చెప్పండి అంటే దానికి తులసి నేను ఆలోచించేది నా గురించి కాదు నీ గురించి అంటుంది. అప్పుడు సామ్రాట్ మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది తులసి గారు నేను లాస్యతో మాట్లాడుతాను అని వెళ్తాడు.
సామ్రాట్, లాస్యతో చెప్పండి అంటే అదే సార్ మా జాబ్స్ గురించి మాట్లాడాలి తులసి మాజీ భర్త నందు అన్న విషయం దాచి ఉంచమన్నది నేనే, నందును ఒప్పించి తులసి దగ్గర మాట తీసుకునే విధంగా చేశాను ఎందుకంటే మా జాబ్స్ కోసం అంటుంది. అప్పుడు సామ్రాట్, నందు ఎక్కడ అని ప్రశ్నిస్తాడు. రాలేదు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు నిన్న జరిగిన దానికి అని చెబుతుంది. సరే మీరు ఇక్కడ జాబ్ చేయాలనుకుంటే నా ఆఫీస్ ప్రశాంతంగా ఉండాలి. నా ప్రాజెక్టు కూడా ప్రశాంతంగా నడవాలి. నా పార్ట్నర్ ఇక్కడ ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలి. ఈ షరతులు ఒప్పుకుంటేనే జాబ్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అంటాడు.
లాస్య సరే సార్ అని థాంక్స్ చెబితే నా నాకు కాదు తులసి గారికి చెప్పండి మీ జాబ్స్ ఉండడానికి కారణం ఆమెనే మీ వల్ల ఆమె చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. మీకు మీకు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి ఇక్కడ ఆఫీసులో కాదు. ఇలాంటివి రిపీట్ అయితే నేను ప్రశాంతంగా మాట్లాడను అంటాడు. తర్వాత లాస్య, తులసితో థాంక్స్ మా జాబ్స్ తీయనందుకు అంటే అపకారికి అపకారం చేస్తే అది ప్రతీకారం అవుతుంది పెద్దగా తేడా ఏమీ ఉండదు.
Intinti Gruhalakshmi:
అదే అపకారికి ఉపకారం చేస్తే ఏమవుతుందో తెలుసా అని ప్రశ్నించగా సహాయం అంటే కాదు శిక్ష అవుతుంది అని బదిలిస్తుంది తులసి. నాకు నా పనులు, నా ఎదుగుదలనే ముఖ్యం ఇలాంటి గొడవలు అనవసరం, ఇలాంటివి ఎక్కువగా నేను పట్టించుకోను ఇదే మాటగా నందగోపాల్ గారికి కూడా చెప్పు అంటే సరే అని తల ఊపుతుంది లాస్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.