Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో తులసి, లాస్యకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి నా విషయాలలో జోక్యం చేసుకుంటే బాగుండదు ఈ విషయం నందగోపాల్ గారికి కూడా చెప్పు అంటుంది. దానికి లాస్య సరే అలాగే చెప్తాను అని మనసులో ఒక్క అవకాశం రాని నేనేంటో చూపిస్తా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సామ్రాట్, తులసితో టిఫిన్ చేద్దాం పదండి అని బయటకు వెళ్తారు. తర్వాత లాస్య, నందుతో మన జాబ్స్ మనకు ఉన్నాయి అంటే నువ్వు ఏం చెప్పి కన్విన్ చేశావని అడుగుతాడు నందు. సింపుల్ ఆరోజు కాస్త సీరియస్ అయినందుకు సారీ చెప్పాను. మా జాబ్స్ కోసం మాజీ భర్త అన్న విషయం దాచాము అంతే వేరే ఉద్దేశం ఏమీ లేదు అంటే సరే అన్నాడు. ఇంతలో దివ్య కాలేజీ నుండి ఫోన్ వచ్చి మీ దివ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అంటే చాలా సంతోషించి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటారు.
తరువాత నందు, లాస్యలు వీళ్ళు ఇంకా రాలేదు నాకు చెప్పి 15 నిమిషాలు పైనే అయింది అంటే లాస్య కారులో వస్తూ మనసు విప్పి మాట్లాడుకోవాల్సినది చాలానే ఉంటాయి తప్పదు బాస్ కోసం ఆ మాత్రం వెయిట్ చేయాలి అంటే పాతికేళ్లు నాకు సేవలు చేసిన తులసి కోసం వెయిట్ చేయాలంటే చిరాకుగా ఉంది. అలాంటి వ్యక్తి కోసం ఇలా చేతులు కట్టుకొని వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకుంటూ ఉండగా ఇంతలో సామ్రాట్, తులసిలు వస్తారు. సామ్రాట్, నందుతో వర్క్ బాగా జరగాలి తులసి గారు మీరు ఏదో చెప్పారు అంటే వెంటిలేషన్ గురించి అంటుంది. నాలుగు వైపులా వెంటినేషన్ ఉండాలంటాడు సామ్రాట్. అప్పుడు లాస్య చాలా ఖర్చవుతుంది అంటే దానికి బదులుగా తులసి మీ చీర ఖరీదు ఎంత అని ప్రశ్నిస్తే 20,000 అని చెప్తుంది. కొన్ని గంటలు అందంగా కనపడనని ఇంత ఖర్చు చేసినప్పుడు మన స్కూల్లో పిల్లల ఆరోగ్యం కోసం కొంత నష్టపోతే తప్పేముంది అంటుంది. సామ్రాట్ మీ ఐడియా బాగుంది నందు ఇలాగే చేయండి అంటాడు. సామ్రాట్, తులసి చేయి పట్టుకొని చిన్న గుంతను దాటిస్తే అది చూసి లాస్య, నందుతో కామెంట్లు చేస్తుంది.
Intinti Gruhalakshmi:
తరువాత సన్నివేశంలో ప్రేమ్, శృతి తో అందరికీ వినపడలాగా కాఫీ ఇవ్వమని అడుగుతాడు. శృతి వినకపోవడంతో అనసూయ మీ ఆయన కాఫీ అడుగుతున్నాడు ఇవ్వమ్మా అంటుంది. వినపడలేదు తెస్తానని తెచ్చి అందులో షుగర్ లేకుండా ఇస్తుంది. కాఫీ చేదుగా ఉందంటే నీ గొంతు పాడు కాకుండా చూసుకునే బాధ్యత మా అందరిదీ అంటే అనసూయ కూడా అవును అని కాఫీ తాగిస్తుంది.తర్వాత సన్నివేశంలో సైట్ ఇంజనీర్ తో తులసి ప్లాన్ గురించి డిస్కషన్ చేస్తుంటే అది చూస్తూ ఉంటాడు సామ్రాట్. ఇంతలో నందు వచ్చి సార్ అని పిలిస్తే పలకకుండా తులసి వైపే చూస్తూ ఉండగా నందు ఏంది సార్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటే నేను ఒక దురదృష్టవంతుని గురించి ఆలోచిస్తున్నాను అది ఎవరో కాదు నువ్వే దేవుడు నీకు గొప్ప వరం ఇచ్చాడు నువ్వు చేతులారా నాశనం చేసుకుంటున్నావు సరే డైరెక్ట్ గా మాట్లాడుతాను తులసి గారు నీ వదులుకోవడం గురించి చెప్తున్నాను అంటే దయచేసి ఆ పీడకల గురించి గుర్తు చేయద్దు అంటాడు నందు. తర్వాత నందు దూరం నుండి చూస్తే చంద్రుడు బానే కనిపిస్తాడు దగ్గరికి వెళ్తే నేను మచ్చలు ఉంటాయి అంటే దానికి సామ్రాట్ చంద్రుడిలో మచ్చలు చూసేవాన్ని మూర్ఖుడు అని అంటూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.