Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో సామ్రాట్ వద్దకు ఫైల్ తీసుకువస్తుంది తులసి. అప్పుడు సామ్రాట్ తో మీరు నిజంగానే ఫైల్ కోసం వచ్చారా లేదంటే నాతో మాట్లాడడానికి వచ్చారా అని ప్రశ్నిస్తుంది. అందుకు సామ్రాట్ ఏం చెప్పాలో తెలియక కాస్త కంగారు పడతాడు. మనసులో నేను మీకు సారి చెప్పాలని వచ్చాను కానీ మీ అత్తయ్య గారు నా నోరు నొక్కేశారు నన్ను క్షమించండి అని అనుకుంటాడు. తర్వాత తులసి మీరు తీసుకున్న నిర్ణయం నాకు బాగా నచ్చింది. ఆ మేనేజర్ పోస్టులో కూర్చుని ఇంకా ఏమైనా పొరపాట్లు జరిగితే.. సరిదిద్దుకోవడం కష్టం అవుతుంది అని అంటుంది. సామ్రాట్ మనసులో ఇదంతా కావాలని నేనే చేశాను మీతో నిజం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు. తర్వాత తులసి ఫైల్స్ చేతికిచ్చి మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. నేను కూడా ఏ అవసరం ఉన్న మీ ఆఫీస్కు లేక ఇంటికి వస్తాను. జరిగిందంతా మర్చిపోండి అంటుంది.
తర్వాత సన్నివేశంలో లాస్య, సామ్రాట్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న అనసూయ ఆంటీ ఒక్క మాట కూడా అనలేదు. ఏదో జరుగుతుంది ఈ సమయంలో అనసూయ అత్తయ్య ను నా వైపుకు తిప్పుకుంటే బాగుంటుంది అనుకొని నందు చేత ఫోన్ చేయించాలి అనుకుంటుంది. కానీ నందు నా మాట వినడు ప్రతిదానికి నీతి నిజాయితీ అంటాడు. నేనే ఫోన్ చేసి మాట్లాడుతాను అని ఫోన్ చేస్తే అనసూయ ఫోన్ కట్ చేస్తుంది. మళ్లీ ఫోన్ ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేశావని కోప్పడుతుంది అనసూయ. అదేంటి అత్తయ్య గారు మా ఇంటికి పెద్దదిక్కు మీరే కదా. అంటూ మేము ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకుంటున్నాము మీరు వస్తే బాగుంటుంది అంటుంది. మీ అబ్బాయికి మీరంటే ఎంతో ప్రేమ ఆయన ఫోన్లో మాట్లాడితే మీరు కోప్పడతారని నేను చేశాను అంటుంది.
తరువాత అనసూయ ఇంట్లో వద్దు రేపు గుడి దగ్గర పూజ చేయించుకుందాం అంటే సరే అంటుంది లాస్య. మరొకవైపు తులసి వద్దకు రావాలని హనీ రెడీ అవుతూ ఉంటుంది. సామ్రాట్ యొక్క బాబాయి నువ్వు వెళ్ళేది తులసి ఇంటికి, పెళ్లి చేసుకోవడానికి కాదు అంటే ఈ ఇంట్లో నా పనులన్నీ నేనే చేసుకోవాలి కదా. ఆడవాళ్లు రెడీ అవ్వడం అంటే అంత ఈజీ కాదు కాస్త ఆగండి అంటుంది. మరొకవైపు సామ్రాట్ ఇంకా ఎంతసేపు బాబాయి అని అడిగితే తాను ఇంకా రెడీ అవుతుంది అంటాడు. మేము వచ్చేది కాస్త ఆలస్యం అవుతుందని తులసికి ఫోన్ చేయమంటాడు సామ్రాట్. సామ్రాట్ బాబాయి నువ్వే చేయొచ్చు కదా ఎప్పటికీ నువ్వు అర్థం కావు అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.
Intinti Gruhalakshmi:
ఇక తర్వాత సన్నివేశంలో తులసి కుటుంబ సభ్యులు అంతా కలిసి బతుకమ్మ పండుగ ఎలా చేయాలో తులసిని అడిగి తెలుసుకుంటారు. తర్వాత అందరూ గుడికి వెళ్తారు. కాసేపటికి అక్కడ నందు, లాస్యలు వస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.