Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో నందు బాధపడుతూ ఆలోచిస్తుండగా ఇంతలో లాస్య వచ్చి నిన్న మందు తాగావా అని ప్రశ్నిస్తుంది. దానికి నందు తాగాను అంటే లాస్య మందు తాగాక రాత్రి ఎక్కడికి వెళ్లావు అని గట్టిగా ప్రశ్నిస్తుంది. అప్పుడు నందు నేనెక్కడికి వెళ్తాను అంటే లాస్య ప్యాంట్ తీసుకువచ్చి ఈ గ్రీసు మరకలు ఏంటి సామ్రాట్ గారి కారు బ్రేకులు నువ్వే తీసావు కదా అని చెప్పడంతో కంగారుగా ఏదో తెలియక చేశాను ఇంకెప్పుడూ ఇలాంటిది చెయ్యను అంటాడు. లాస్య ఈ విషయం ఎవరితో అయినా చెప్పావేమో గుర్తు తెచ్చుకో అంటే మన మెకానిక్ చెప్పాను అంటాడు నందు. ఏదో ఒకటి చేసి వాడి నోరు మూయించి లేదంటే సమస్య పెద్దదవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
తరువాత సన్నివేశంలో హనీ భోజనం చేయకుండా నాకు ఆకలి లేదు అని సామ్రాట్ కు గుడ్ నైట్ చెప్పి వెళ్లి నిద్రపోతుంది. సామ్రాట్ బాధపడుతుంటే ఇంతలో తన బాబాయి వస్తాడు. ఇప్పుడేం జరిగిందని బాధపడుతున్నావ్ మంచే జరిగింది కదా ప్రమాదం నుండి ఇద్దరు బయటపడ్డారు కదా అంటే లేదు బాబాయ్ ప్రమాదంలో నాకేదైనా జరిగి ఉంటే హనీ ఒంటరిగా మిగిలిపోయేది. ఒక అనాధల బతకాల్సి వచ్చేది. తల్లి ప్రేమకు, తండ్రి ప్రేమకు చాలా తేడా ఉంది నా వల్లే హనీ ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది అంటూ బాధపడతాడు.
తరువాత సన్నివేశంలో తులసి బాధపడుతుంటే కుటుంబ సభ్యులు అందరూ వచ్చి హనీ కి ఎం పరవాలేదు కొద్ది రోజుల్లోనే కోరుకుంటుంది అంటే అందుకు తులసి పాపం తల్లి లేని పిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో పైగా సామ్రాట్ గారికి కూడా దెబ్బలు తగిలాయి అంటుంది. తరువాత దివ్య హనీ కోలుకునే వరకు ఇక్కడికే తెచ్చి పెట్టుకుందాం అంటే దానికి అభి ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించు బయట వాళ్ల గురించి కాదు వాళ్ళ ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు ఏ లోటు ఉండదు అంటారు. తులసి, అభితో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటే సామ్రాట్ ఒక గొలుసు పోతేనే పెద్ద రాద్ధాంతం చేశాడు ఇప్పుడు హనీకి ఏ చిన్న ఇబ్బంది కలిగిన అది ప్రాబ్లమే అవుతుంది అంటే మనం ఆలోచన చేయాల్సింది హనీ గురించి మాత్రమే సామ్రాట్ గురించి కాదు అంటుంది.
తరువాత సన్నివేశంలో లక్కీ, లాస్యతో హనీకి యాక్సిడెంట్ జరిగిందా అంటే నీకెవరు చెప్పారు అంటుంది లాస్య. అప్పుడు లక్కీ మా స్కూల్లో అందరూ అనుకుంటున్నారు అంటే అవును నిజమే అంటూ ఉండగా ఇంతలో నందు వచ్చి ఇవన్నీ నీకెందుకురా అంటే మా ఫ్రెండ్ కదా తనకేబడి అయితే వెళ్లి చూడాలి అంటాడు. నువ్వు స్కూలుకు వెళ్ళు అంటే లాస్య ఈరోజు స్కూలుకు వద్దు వెళ్లి డ్రెస్ మార్చుకొని రా అంటుంది. దానికి నందు నేను చెప్పిన ప్రతి పనికి వ్యతిరేకంగా చేయడమే నీ పనే అంటే కాదు మనం ఆ ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావాలి అందుకు వారధి లక్కీ పదా వెళ్దాం అని వెళ్తారు.
Intinti Gruhalakshmi:
తరువాత సన్నివేశంలో తులసి వంట చేస్తుంటే శృతి,దివ్యలో వంట గురించి పొగుడుతూ ఉంటారు మరోవైపు పరంధామయ్య, అనసూయలు వాసన గుమగుమలాడుతుంది అంటూ ఇంట్లో వాళ్ళు తిననీయరు కదా అని ఫోన్లో పాప ఏడ్చే వాయిస్ పెడితే ఇంట్లో వాళ్ళు కంగారుగా ఇంట్లో అంతా వెతుకుతుండగా వీళ్ళిద్దరూ కిచెన్ లో దూరి పాయసం త్రాగడం కుటుంబ సభ్యులందరూ చూస్తూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఎవరికి వస్తుంది.