Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 5వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో అనసూయ, సామ్రాట్ తో నాకిచ్చిన మాట ఏం చేశావని గట్టిగా నిలదీస్తుంది. మీ డబ్బు ఉన్నవాళ్లు సమాజం ఏం మాట్లాడినా పెద్దగా పట్టించుకోరు. మాలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్లు కచ్చితంగా సమాజానికి ఏం జరిగినా సమాధానం చెప్పాలి. తులసి ఎదగాలని నాకు కూడా ఉంది కానీ అంతకంటే ముందు నాకు పరువు చాలా ముఖ్యం. నీ నిర్ణయం ఏదో సాయంత్రం పార్టీ అయ్యే లోపు కచ్చితంగా చెప్పాల్సిందే అని చెబుతుంది.
తరువాత తులసి, హనీ డ్రెస్ చేంజ్ చేసి సామ్రాట్ వద్దకు తీసుకువస్తుంది. సామ్రాట్ తో డైరెక్ట్ గా నేను తెచ్చిన డ్రెస్ బాగాలేదా లేదంటే నేను తీసుకురావడం బాగాలేదా అని సూటిగా అడుగుతుంది. అటువంటిదేమీ లేదు హనీ మీకు దగ్గరవుతూ ఉంటే నాకు దూరం అవుతున్నట్లు అనిపిస్తుంది. హనీ మనసులో నాకు కూడా స్థానం ఉండాలి కదా. అందుకే ముందే జాగ్రత్త పడుతున్నాను. తర్వాత జాగ్రత్త పైన కూడా ఫలితం ఉండదు కదా అంటాడు. అప్పుడు తులసి నవ్వుతూ ఇంతేనా.. నేను ఆఫీసులో జరిగిన విషయం ఇంకా మీ మనసులోనే ఉందేమో అనుకున్నాను ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అంటుంది. తర్వాత హనీని తీసుకురండి కేక్ కట్ చేసే టైం అయింది అని చెబుతుంది.
తరువాత సన్నివేశంలో నందును పార్టీకి వచ్చిన ఒక గెస్ట్ చాలా అసభ్యకరంగా మాట్లాడతాడు. నందు కోప్పడితే లాస్య కంట్రోల్ చేస్తుంది. మరొకవైపు అనసూయ నా మాటలు పట్టించుకుంటున్నాడో లేదో సామ్రాట్ అని కంగారుపడుతూ ఉంటుంది. సామ్రాట్ వద్దకు అభి వచ్చి నానమ్మ ఏదో ప్లాన్ చేస్తుంది మనకు మంచి రోజులు వస్తాయి అంటాడు. అప్పుడు నందు మీ నానమ్మ తాతయ్యలు మళ్లీ ఎందుకు పట్టించుకుంటారు. అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
తరువాత సన్నివేశంలో కేక్ కట్ చేయడం కంటే ముందు హనీ, తులసికి గిఫ్టుగా ఒక పాటను డెడికేట్ చేస్తుంది. తర్వాత హనీ కేక్ కట్ చేసి తులసికి తినిపించే ప్రయత్నం చేయగా ముందు మీ నాన్నగారికి తినిపించు అంటుంది తులసి. అప్పుడు హనీ నాన్నకు ఇష్టమైన డ్రెస్ వేసుకున్నాను కాబట్టి నాన్న ఏమనరు ముందు మీకే తినిపిస్తాను అంటూ సామ్రాట్ తో చెబితే సామ్రాట్ సరే అంటాడు. ముందు తులసికి తినిపించి ఆ తర్వాత సామ్రాట్ కు తినిపిస్తుంది. ఇదంతా చూస్తున్నా లాస్య నందుతో రన్నింగ్ కామెంట్రీ చేస్తూ ఉంటుంది.
Intinti Gruhalakshmi:
తరువాత సామ్రాట్ ఈరోజు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అంటూ నందు ను స్టేజ్ పైకి పిలుస్తాడు. తర్వాత నందు ను పొగుడుతూ తులసి మేనేజర్ పోస్ట్ కాస్త నందుకు ఇస్తున్నట్లు ప్రకటిస్తాడు. తర్వాత తులసి మొహమాటానికి పోకుండా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కరెక్ట్ గా ఆలోచించే వారిని బాస్ అంటారు. మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను అంటూ నందుకు కంగ్రాట్యులేషన్స్ చెబుతుంది. ఇక లాస్య, అభిల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మరొకవైపు అనసూయ కూడా సంతోషిస్తుంది. మిగిలిన తులసి ఇంటి కుటుంబ సభ్యులు ఆఫీస్ విషయాలు ఇలా పబ్లిక్లా ఫంక్షన్ లో ఎలా డిసైడ్ చేస్తారని అనుకుంటూ కాస్త అప్సెట్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.