Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ తన వాళ్ళు రావడంతో తులసి సంతోషపడుతుంది. ఇక పరంధామయ్య నా సంతోషం కోసం మాత్రమే బతుకుతున్నాను అని అనటంతో ఇక్కడికి రావడం మీకే కాదు నాకు కూడా సంతోషంగా ఉంది అని అంటుంది తులసి. దాంతో పరంధామయ్య నావల్ల నీకు ఇబ్బంది అవుతుందేమో అని అనటంతోఇలాంటిదేమీ లేదు అని అంటుంది.
అత్తయ్య గారిని కూడా తీసుకురావాల్సింది అని తులసి అనటంతో.. నిప్పుకు దూరంగా ఉందామని వస్తే నిప్పును తగిలించుకొని రమ్మంటావేంటమ్మా అంటూ మాట్లాడుతాడు. ఆ తర్వాత తులసి ఈ పూజ మీకోసమే చేస్తున్నాను అని అంటుంది. వెంటనే సామ్రాట్ ఇక్కడ గొడవలు జరుగుతాయో అని మిమ్మల్ని పిలవలేదు అని అంటాడు.
ఇక పరంధామయ్య గొడవలు అవుతాయని కావలసిన వాళ్ళని వదులుకోలేము కదా అని అనటంతో అప్పుడే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అందుకే నేను వచ్చాను అని ఎంట్రీ ఇస్తాడు. దాంతో కుటుంబ సభ్యులంతా మరింత సంతోష పడతారు. అంతేకాకుండా పరంధామయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళిపోవటంతో అనసూయకు బాగా కోపం వస్తుంది. దాంతో తులసి వల్లే అని తులసి పై మరింత మండిపడుతుంది. తనను అత్తలా కాకుండా అమ్మలా చూసుకున్నా అని నాకే పెద్ద శిక్ష వేసింది అని అంటుంది. వెంటనే లాస్య.. ఆ తులసి అందరిని తన వైపు లాక్కుంటుంది అని అంటుంది. వెంటనే అభి మధ్యలోకి వచ్చి అవును లాస్య ఆంటీ చెప్పింది కరెక్ట్ అని మాట్లాడుతాడు.
వెంటనే లాస్య ఏం చేయాలన్న మీరే చేయాలి అని అనసూయతో అంటుంది. అంతేకాకుండా మీరే రంగంలోకి దిగితే తులసి తిక్క కుదురుతుంది అని అంటుంది. దాంతో అనసూయ కోపంతో ఇక అవధులను అని అంటుంది. అక్కడికి వెళ్లి దాని అంటూ చూద్దాము అని అంటుంది. పూజ పూర్తవటంతో తులసి సంతోషంగా కనిపిస్తుంది.
ఇక పరంధమయ్య దగ్గరికి పిల్లలందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అంతేకాకుండా కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంటారు. దానికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇక అనసూయ కోపంతో ఉండగా వెంటనే అభి ఈరోజు ఏదో ఒకటి తెలుసుకోవాలి అని అంటాడు. లాస్య కూడా అనసూయ ను బాగా రెచ్చగొడుతుంది.
ఇంట్లో వాళ్లంతా సందడి చేస్తూ ఉండగా అప్పుడే వీళ్ళు ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతారు. ఇక గొడవ జరుగుతుందేమో అని పరంధామయ్య వాళ్ళని వెళ్లిపోమని అంటాడు. మాధవి కూడా తన తల్లిని వెళ్లిపోమని అంటుంది. అనసూయ తులసి దగ్గరికి వెళ్లి బాగా అరుస్తుంది. దాంతో పరంధామయ్యకు కోపం రావడంతో అనసూయ మీదికి చేయెత్తుతాడు.
Intinti Gruhalakshmi:
అది చూసి అందరూ షాక్ అవుతారు. పరంధామయ్య అనసూయ పై అరుస్తాడు. నీ నోటి దురుసు తగ్గించుకో అని అంటాడు. నేను కూడా అనసూయ తులసిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది. పరంధామయ్య మాత్రం తులసి గొప్పతనం గురించి మాట్లాడుతాడు. అంతేకాకుండా అనసూయని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని అంటాడు. దాంతో అనసూయ మరింత కోపంతో కనిపిస్తుంది.