Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో అనసూయ, పరంధామయ్య మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. ఇక అనసూయ పరంధామయ్య కోసం తను పడిన బాధలు గురించి చెబుతుంది. దాంతో పరంధామయ్య నువ్వు చేసిన సేవలకు నా మౌనం నీకు బహుమానంగా ఇచ్చాను అని.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట నన్ను అన్నప్పుడు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకొని నేను ఏమనలేకపోయాను అని అంటాడు. అందరూ నోరులేని భర్త అని నన్ను అన్నప్పుడు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉన్నాను అని అంటాడు.
కానీ ఇప్పుడు మాత్రం ఊరుకోను అని దయచేసి ఇక నుంచి వెళ్లిపోని అంటాడు. కానీ అనసూయ మాత్రం వెళ్ళను అని మొండికేస్తుంది. ఇక్కడ వీళ్ళ ఆనందాన్ని పాడు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ పరంధామయ్య గట్టిగా అంటాడు. ఇంకా అనసూయ మీ వల్ల జీవితం సగం నాశనం అయ్యింది అంటూ.. మీ ముద్దుల కూతురు వల్ల కూడా సగం నాశనం అయ్యింది అంటూ తులసిని ఉద్దేశించి అంటుంది.
పరంధామయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎంత చెప్పినా కూడా అనసూయ ముందుగా మాట్లాడుతుంది. అంతేకాకుండా భర్తగా ఎప్పుడైనా బాధ్యతలు పూర్తిగా నెరవేర్చారా అంటూ పాత గొడవలన్నీ బయటికి తీస్తుంది. అప్పట్లో మాకు అంత డబ్బులు లేవని పరంధామయ్య అనడంతో అలాంటప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది.
అలా పాత గొడవలన్నీ తీసి మరింత రచ్చ చేస్తుంది అనసూయ. ఇక తన కొడుకు చేస్తేనే ఇల్లు గడిచేది అంటూ నందు గురించి మాట్లాడుతుంది. ఇక తులసి ఆ మాటలని భరించలేక తన అత్తపై ఫైర్ అవుతుంది. మామయ్య గారిని చులకన చేసి మాట్లాడొద్దు అని అంటుంది. ఇక సామ్రాట్ కూడా అనసూయను మందలించడంతో నీకు అవసరం లేదు అన్నట్లుగా సమాధానం ఇస్తుంది.
ఇక ప్రేమ్ నీలాగే రేపు లాస్య కూడా ప్రవర్తిస్తే ఏం చేస్తావు అనటంతో వెంటనే ప్రేమ్ ను కొడుతుంది అనసూయ. ఇక అక్కడ ఉన్న వాళ్లంతా అనసూయని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. అనసూయ మాత్రం నేను చెప్పిందే వినాలి అంటూ గట్టిగా మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి పద అని పరంధామయ్యతో అంటుంది. పరంధామయ్య తను రాను అని ఇక్కడే ఉండిపోతాను అని అంటాడు. అనసూయ మాటలు తట్టుకోలేక చాలా బాధపడుతుంటాడు.
Intinti Gruhalakshmi:
ఇక్కడే ఉంటాను అని అంటాడు పరంధామయ్య. దాంతో అనసూయ కూడా మీరు కూడా నాకు అక్కర్లేదు అని అంటుంది. పరంధామయ్య బాధపడటంతో ఈ కూతురు ఉంది కదా మావయ్య అంటూ ఓదారుస్తుంది తులసి. మీ మామయ్య కోసం నేను ఎప్పుడూ ఉంటాను అని తులసి అందరితో అంటుంది. అక్కడే ఉన్న అభి మనం తాతయ్యని తీసుకెళ్లడానికి వచ్చాము అని అనటంతో పరంధామయ్యకు పోవడానికి ఇష్టం లేక తులసి తో లోపలికి తీసుకెళ్ళమని అంటాడు.