Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో.. తులసిపై అనసూయ నందు దంపతులు విరుచుకుపడుతూ ఉంటారు. ఆ వీడియో చివర్లో సామ్రాట్ పడిపోతారు అని కావాలంటే చూడండి అని తులసి అనటంతో.. వెంటనే నందు.. తాను పడిపోవడం కాదు అతని కౌగిలిలో నువ్వు పడిపోయావు.. ఆ విషయం గురించి మాట్లాడదాము అని.. ముగ్గురు పిల్లల తల్లి అయ్యుండి ఏం చేస్తున్నావు అంటూ నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ గట్టిగా మాట్లాడతాడు.
వెంటనే తులసి నందు పై అరవటంతో మధ్యలో అనసూయ కోపంతో తులసి పై అరుస్తుంది. నందు పై ఎందుకు అరుస్తున్నావు అంటూ.. అతడు చెప్పింది నిజమే కదా.. ఇంత దిగజారి పోతావు అని అనుకోలేదు అనటంతో ఆ మాటలకు తులసి షాక్ అవుతుంది. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అత్తయ్య అంటులసి బాధపడుతుంది. ఈ పాతికేళ్లలో ఎప్పుడైనా నేను తప్పుగా ప్రవర్తించాను అని అంటుంది.
దాంతో అనసూయ ఇప్పుడు తులసి వేరు అప్పుడు తులసి వేరు అంటూ.. నువ్వు చాలా మారిపోయావు నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని తులసి చాలా బాధపడుతుంది. వెంటనే ప్రేమ్ అందరూ అమ్మని ఎందుకలా అంటున్నారు అని.. ఎవరికి సిగ్గుగా అనిపించడం లేదా అని అనడంతో అభి అందులో తప్పేముంది నిజమే కదా అని అంటాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఎవరు ఆపిన కూడా వాళ్ళు వినిపించుకోరు.
వెంటనే తులసి ఆ గొడవను ఆపమని నందుతో అంటుంది. దాంతో నందు తల్లే హద్దుల్లో లేదు వాళ్లు ఎలా హద్దుల్లో ఉంటారు అని అంటాడు. ఆ తర్వాత తులసి కోపంతో నేనేం తప్పు చేయలేదు నాకు సామ్రాట్ గారి మధ్య కేవలం స్నేహమే ఉంది.. మీరు ఏమనుకుంటారో అది అనుకోండి అంటుంది. మరోవైపు సామ్రాట్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ బాబాయ్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. దాంతో సామ్రాట్ తులసి గురించి చెబుతూ బాధపడతాడు.
తులసిని తప్పుపడుతున్నారేమో అని అంటాడు. కానీ సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసి గట్టిగానే మాట్లాడుతుంది అని అన్నట్లు చెబుతాడు. ఆ తర్వాత తులసికి ఫోన్ చేయమని చెబుతాడు. ఇక తులసి కోపంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మాటలు ఎందుకు పడాల్సి వస్తుంది అని బాధపడుతుంది. ఇక అనసూయ నువ్వు తప్పులు చేస్తున్నావు హద్దులు దాటావు అని మాట్లాడుతుంది.
Intinti Gruhalakshmi:
దాంతో తులసి అనసూయ పై కోపంగా మాట్లాడుతుంది. ఇంత జరిగాక నేను ఇక్కడే ఉంటే నాకే అసహ్యం వేస్తుంది అని.. నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది తులసి. వెంటనే లాస్య సామ్రాట్ దగ్గరికి వెళ్లడానికి మంచి మార్గం ఎంచుకున్నావు అంటూ తెలివైన దానివి అని.. పెళ్లి ఎప్పుడు అంటూ వెటకారం చేస్తూ మాట్లాడుతుంది. వెంటనే తులసి బాధపడుతుంది. ఇక దివ్య తాతయ్య లేని సమయాన్ని చూసి అమ్మని బెదిరిస్తున్నారు అని అంటుంది.