Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో అభి, గాయత్రి ఇంటికి వెళ్తే నా కూతురు అంకిత ఎక్కడ అని ప్రశ్నించగా రాలేదని చెప్తాడు. దానికి గాయత్రి వస్తే అంకితతోనే రావాలి లేదంటే విడాకులు ఇచ్చేయ్ అంటుంది. దానికి అభి మా మామ్ అంకితకు రోల్ మోడల్ గా ఉంది నన్నేం చేయమంటారు అంటాడు. నీ ఇష్టం ఆలోచించుకో అభి, భార్యను తీసుకొని అత్తారింటికి వస్తావో, లేదంటే చేతకాని మొగుడిగా పుట్టింట్లోనే ఉండిపోతావో నీ ఇష్టం అంటే అక్కడి నుండి వచ్చేస్తాడు అభి.
తరువాత సన్నివేశంలో లాస్యతో, నందు కంగారుపడుతూ ఎప్పుడో ఒకసారి నిజం తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అంటే ఆ చాన్సే లేకుండా పెళ్లిలో మూడు ముళ్ళు వేసినట్టే ఇక్కడ కూడా రెండు మూడు ప్లాన్లు వేసి ఉన్నదూరని మరింత పెంచడమే అంటూ పేపర్లో తప్పుడు ప్రకటన తులసి ఇచ్చినట్టుగా తానే ఇచ్చానని ఆ పేపర్ సామ్రాట్ చదివి తులసి ఇంటికి వెళ్తే అప్పుడే ప్రెస్ వాళ్లు అక్కడ ఉండడం చూసి మరింత రెచ్చిపోతాడు సామ్రాట్ అంటూ ఆ పేపర్ ను సామ్రాట్ కు చేరే విధంగా బాయ్ తో ఇచ్చి పంపిస్తుంది.
తులసి మ్యూజిక్ పాటలు చెప్పడానికి స్కూల్ వాళ్ళు ఏదైనా రూమ్ అడ్జస్ట్ చేస్తారేమో వెళ్లి ఓసారి అడుగుతాను మామయ్య అంటే సామ్రాట్ గారితో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అంటాడు. దురదృష్టం ఎల్లప్పుడూ వెంటాడుతుంటే నేనేమో ఊహల్లో ఎగురుతూ ఉన్నాను. నాకు అంత అర్హత లేదు అంటూ బయటకు వస్తుంది. ఇంతలో మీడియా వాళ్ళు వచ్చి ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు మీద సామ్రాట్ గారు స్పెషల్ గా ఇంట్రెస్ట్ పెట్టారు. ఈ మ్యూజిక్ స్కూల్ నుండి తప్పుకోవడానికి కారణం ఏంటి ఇది నిజమేనా అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తుంటే ఈ విషయం మీకు ఎవరు చెప్పారు, ఇది సామ్రాట్ గారి ప్రాజెక్ట్ దీని గురించి మాట్లాడ హక్కు నాకు లేదు. ఈ ప్రాజెక్టులో ఆలోచన మాత్రమే నాది పెట్టుబడి పేరు ఆయనదే అంటుంది.
మరోవైపు చెయ్యి తగిలి పేపర్ కింద పడుతుంది. పేపర్ చూసి కోపపడుతున్న సామ్రాట్ వద్దకు లాస్య వచ్చి మరింత రెచ్చగొట్టి ఇదే కాదు ప్రెస్ వాళ్లను కూడా పిలిచింది, జరుగుతుందో ఏమో అంటే కోపంగా ఆ పేపర్ తీసుకొని వెళ్తాడు సామ్రాట్. తులసితో మీడియా వాళ్ళు ఓపెన్ గా మాట్లాడమంటే దానికి ప్రేమ్ ఈ ప్రాజెక్టు గురించి సామ్రాట్ గారిని అడగమని చెప్పింది కదా మా అమ్మ, దయచేసి మా అమ్మను విసిగించొద్దు అంటే అక్కడినుండి వెళ్ళిపోతారు.
Intinti Gruhalakshmi:
ఇదంతా వీళ్ళకి ఇలా తెలిసింది అసలు ఏం జరుగుతుందో అని బాధపడుతుండగా ఇంతలో సామ్రాట్ వస్తాడు. తులసి తో కొండపైన ఎగిరిన పక్షి తను కూడా కొండతో సమానం అనుకోవడం తప్పు. పాలు పూసిన చెయ్యనే కాటేయడం మహా పాపం. అంటూ తులసిని నిందిస్తూ ఉండగా మా అమ్మ చేసిన తప్పేంటి అని ప్రేమ్ ప్రశ్నిస్తాడు. దానికి సామ్రాట్ మీ అమ్మకు ఈగో ఉంది అంటూ ఉండగా ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.