సందీప్ కిషన్ కెరియర్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసిన చెప్పుకోవడానికి ఓ రెండు, మూడు హిట్స్ తప్ప పెద్దగా ఏమీ లేవు. అయినా కూడా ఇప్పుడున్న యువ హీరోలలో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా సందీప్ కిషన్ కి మంచి గుర్తింపు ఉంది. అతని సినిమా వచ్చింది అంటే ఎంతో కొంత ఓపెనింగ్ ఉంటుంది. ఇక సక్సెస్ బట్టి తర్వాత ఆడియన్స్ థియేటర్స్ కి రావడం ఆధారపడి ఉంటుంది. అయితే అతని స్టోరీ సెలక్షన్స్ లో లోపాలు వలన సందీప్ కిషన్ ఖాతాలో హిట్స్ కంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈ యంగ్ హీరో కూడా జెనరేషన్ కి తగ్గట్లు తన కథల ఎంపికలో మార్పులు చేసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో తెలుగు, తమిళ్ బాషలని టార్గెట్ చేశాడు. ఏకంగా మైఖేల్ అనే కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవల్ లో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలని అనుకుంటున్నాడు.
రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషిస్తూ ఉండటం విశేషం. విజయ్ సేతుపతి కారణంగా ఈ మూవీకి మంచి హైప్ వచ్చింది. ఇక తాజాగా సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరజ్ పోస్టర్ ని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సినిమాలో తాను కూడా భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు.
ఇక ఈ మూవీలో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో మెరుస్తుంది. అలాగే వరుణ్ సందేశ్ కూడా కూడా ఓ కీలక పాత్రలో మెరవనున్నారు. గౌతమ్ మీనన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీతో కోలీవుడ్ లో జెండా పాతాలని సందీప్ కిషన్ చూస్తున్నట్లు ఉంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో సందీప్ కిషన్ కనిపించడం విశేషం. ఇక గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని శుక్రవారం ఎనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు. అదేంటి అనేది తెలియాల్సి ఉంది.