బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చాలా కాలం తర్వాత మరల బాలయ్య బాబు ఈ సినిమా చేస్తున్నాడు. నిజ జీవిత కథల స్ఫూర్తితో గోపీచంద్ మలినేని ఈ సినిమా కాన్సెప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. పవర్ ఫుల్ రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ గా ఒక పాత్రలో కనిపించగా మరో పాత్రలో ఎన్నారైగా అలరించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో బాలకృష్ణకి జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. అయితే ఆమె కనిపించేది ఏ పాత్రకి జోడీగా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి వచ్చేసింది. ఇంకా చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఇక గోపీచంద్, బాలయ్య సినిమాకి సంబందించిన టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ని దీపావళికి సర్ప్రైజ్ గా అందించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ పై ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం గోపీచంద్ వీరసింహారెడ్డి అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
సినిమాలో మెయిన్ బాలకృష్ణ క్యారెక్టర్ పేరుగా ఇది ఉంటుందని, దీనినే టైటిల్ గా పెట్టె ఆలోచనతో ఉన్నాడని టాక్. బాలకృష్ణ కెరియర్ లో నరసింహారెడ్డి, నరసింహా నాయుడు, చెన్నకేశవరెడ్డి లాంటి హిట్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో సెంటిమెంటల్ గా కూడా ఈ టైటిల్ వర్క్ అవుట్ అవుతుందని భావించి గోపీచంద్ అలా ఫిక్స్ అయినట్లు టాక్. ఇదే టైటిల్ ని దీపావళికి ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని బోగట్టా. అయితే ఈ టైటిల్ ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన సినిమాల తరహాలో ఉందని, కొత్తదనం లేదనే మాట కొంతమంది నందమూరి అభిమానుల నుంచి వస్తుంది.