హీరోయిన్ గా ఫైవ్ స్టార్ హోటల్స్ ఖరీదైన కార్లు చూసిన అందాల భామలకి స్వచ్చమైన గాలిని పీల్చాలనే ఆసక్తి ఉంటుంది. అలాగే ఒక సామాన్యురాలిగా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్లాలని అనుకుంటారు. సింపుల్ గా ఎలాంటి కెమెరా, లైట్స్ కి చిక్కకుండా ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు. ఇండియాలో ఫేం ఉన్న సెలబ్రిటీలు ఎవరైనా వారు కోరుకున్న లైఫ్ ని మాత్రం అనుభవించలేరు. అందుకే అప్పుడప్పుడు విదేశాలు వెళ్ళిపోయి కొద్ది రోజులు హ్యాపీ గా, ఆర్భాటాలకు దూరంగా ఎంజాయ్ చేసి వస్తారు. అలాగే ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారు. తాజాగా ఓ నటి హ్యాపీగా హైదరాబాద్ లో అది కూడా ఆటోలో జర్నీ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
తన హాపీ నెస్ ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంది. ఆటోలో మాస్క్ లో ఉన్న ఆ నటిని ఇట్టే గుర్తుపట్టొచ్చు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలలో నటిస్తూ, మరో వైపు శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జ్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఆటోలో ఇలా వెళ్తూ ఉంటే చుట్టూ వస్తున్న గాలిని ఆశ్వాదించొచ్చు. అదే కారులో అయితే మొత్తం క్లోజ్ డోర్స్ తో ఇబ్బందిగా ఉంటుంది అని ఒక ఫోటో పెట్టి తన ఫీలింగ్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది.
మాస్క్ పెట్టుకొని ఉండటంతో ఆమెని ఆటో డ్రైవర్ గుర్తు పట్టి ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తుంది. ఇక ఇంద్రజ విషయానికి వస్తే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి పెళ్లి చేసుకొని 7 ఏళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కావడంతో మరల దిక్కులు చూడకు రామయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అడపాదడపా సినిమాలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. మధ్యలో ఖాళీ సమయాన్ని టెలివిజన్ లో రియాలిటీ షోల కోసం వెచ్చిస్తుంది.