భారతీయ సంస్కృతి, సంప్రదాయం ప్రపంచానికి ఆదర్శం. ఎక్కడికి వెళ్లిన ఇండియన్ కల్చర్ ని పాశ్చాత్యులు బాగా గౌరవిస్తారు. ఇప్పుడు అయితే ఇతర దేశాల వారు మన నాగరికత, కట్టు, బొట్టుని అనుసరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చీరకట్టులో ఉండే అందాన్ని వారు ఆశ్వాదిస్తున్నారు. అయితే ఇండియన్ స్త్రీలు మాత్రం పాశ్చాత్య నాగరికతని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. చీరకట్టుని వదిలేసి మోడరన్ డ్రెస్సులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైనా వారి డ్రెస్సులు గురించి ప్రశ్నించిన, విమర్శలు చేసిన స్త్రీ స్వేచ్ఛకి అడ్డుతగులుతున్నారు అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఇక సెలబ్రెటీలు అయితే వారి డ్రెస్ స్టయిల్ లో అస్సలు ఎవరూ ప్రశ్నించకూడదు. కొందరు అయితే అందాలు ఉన్నది చూపించడానికే కదా అంటారు.
अरे काकी कहां पहुंच गई 😂😂 pic.twitter.com/tQkIsGRuWD
— Rishika gurjar (@Rishikagurjjar) August 22, 2022
మరికొందరు వెస్ట్రన్ డ్రెస్సులులో మాకు కంఫర్ట్ గా ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే ఇప్పటికి కూడా కొందరు ఇండియన్ మహిళలు చీరకట్టుని గౌరవంగా భావిస్తారు. ఎలాంటి ప్రదేశంలో అయిన చీరకట్టులోనే కనిపించడానికి ఇష్టపడతారు. బీచ్ లో ఉన్నపుడు బికినీలే వేయాలి అనే సెలబ్రెటీలు ఉన్న ఇండియాలో బీచ్ లో ఉన్న చీరలో ఉన్న అందం ఇంకెక్కడా రాదు అని చూపించే వారు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఫారిన్ లో బీచ్ లో విదేశీ వనితలు అందరూ బికినీలలో సందడి చేస్తున్నారు. వారి మధ్యకి చీరకట్టులో ఉన్న ఓ మహిళ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఉన్న అందరూ టూ పీస్ బికినీలలో కనిపిస్తే అందరికంటే ప్రత్యేకంగా ఉండటంతో అక్కడున్న ప్రతి ఒక్కరి దృష్టి ఆమెపై పడింది. ఇక వీడియో కూడా ట్విట్టర్ లో వైరల్ అయ్యింది. ఎక్కడున్న చీరకట్టుకి ఉన్న ప్రత్యేకతే వేరు అంటూ ఆ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.