స్పోర్ట్స్ అన్నాక గెలవడం ఓడడం చాలా కామన్ దాన్ని తీసుకోవడం ఫ్యాన్స్ కు తెలియకపోయినా ప్లేయర్స్ కు తెలియాలి ఈ విషయం పాపం పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్స్ కు అస్సలు తెలియదు.మొదటిసారి భారత్ పై టి20 వరల్డ్ కప్ లో గెలిచిన పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ ను,బిసిసిఐ ను భయంకరంగా ట్రోల్ చేశారు.భారత్ ఓడిపోవడం కన్నా పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ భారత్ క్రికెట్ అభిమానులను బాగా హార్ట్ చేసింది.పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్సే కాదు పాకిస్తాన్ బోర్డ్ సైతం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్ అంటూ ట్వీట్ చేసి మన వాళ్ళని రెచ్చగొట్టారు. అది చాలదన్నట్టు షాహిన్ అఫ్రిది మొన్న జరిగిన మ్యాచ్ లో అతని బౌలింగ్ లో ఔట్ అయిన కోహ్లీ, రోహిత్,రాహుల్ ను ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు.
అందుకే నిన్న యావత్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలవాలని కోరుకున్నారు.వాళ్ళ కోరిన విధంగా లాస్ట్ లో బ్యాక్ టు బ్యాక్ సిక్స్ లు కొట్టి వేడ్ ఆస్ట్రేలియాకు విజయం అందించాడు.ఇక ఎప్పటి నుండో పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ కు చెక్ పెట్టాలని వెయిట్ చేస్తున్న ఇండియన్ ఫ్యాన్స్ మీమ్స్ తో పాకిస్తాన్ తాట తీస్తున్నారు.