Indian cricketer: ప్రపంచవ్యాప్తంగా టీమిండియా అభిమానులు పులకించిపోయారు. చాలా ఏళ్లుగా ఏకపక్షంగా సాగుతున్న చిరకాల ప్రత్యర్థుల పోరాటాన్ని చూసి విసిగిపోయిన అభిమానులకు టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్ ఎంతో మజా అందజేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు చొప్పున తీసి పాకిస్థాన్‌ను కట్టడి చేశారు.
ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ ఆరంభ ఓవర్లలో చెలరేగి బౌలింగ్ చేశాడు. ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ప్లే లో అదరగొట్టిన అర్ష్‌దీప్ బౌలింగ్‌ను చూసి అభిమానులు ఫిదా అయ్యారు.
అభిమానులే కాకుండా ఓ టాలీవుడ్ సినిమా దర్శకుడు కూడా అర్ష్‌దీప్ బౌలింగ్ పట్ల ఆకర్షితుడు అయ్యాడు. జాతిరత్నాలు సినిమా దర్శకుడు కేవీ అనుదీప్ అర్ష్‌దీప్ సింగ్‌కు సినిమా అవకాశం ఇస్తానని ప్రకటించాడు. మరోవైపు స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ బాక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన అనుదీప్ తన దైన పంచులతో నవ్వించాడు. ఇటీవల అనుదీప్ దర్శకత్వం వహించిన ప్రిన్స్ మూవీ దీపావళి కానుకగా అభిమానుల ముందుకు వచ్చింది.
Indian cricketer:
ప్రిన్స్ మూవీలో శివకార్తీకేయన్ హీరోగా నటించాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. పాండిచ్చేరిలో జరిగిన ఒక తమిళ అబ్బాయి, ఇంగ్లీష్ అమ్మాయి ప్రేమకథగా ప్రిన్స్ సినిమా తెరకెక్కింది. అనుదీప్ స్టైలులో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. ప్రపంచ వ్యాప్తంగా తమిళ, తెలుగు భాషల్లో విడుదలై మంచి టాక్ సంపాదించింది.