Indian Cricket: టీ20 వరల్డ్ కప్ మీద భారీ అంచనాలున్న టీమిండియా విషయంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలక బౌలర్లు గాయాల పాలవుతుండటం క్రికెట్ అభిమానులకు నిరాశను మిగులుస్తోంది. కాగా టీమిండియా ప్లేయర్ల ఎంపిక కష్టసాధ్యంగా మారిందని టీమిండియా వరల్డ్ కప్ తాత్కాలిక హెడ్ కోచ్ మరియు ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
గతంలో ఒకేసారి రెండు వేర్వేరు సిరీస్ ల కోసం రెండు ఇండియన్ టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం ఇంగ్లండ్ లో టీమిండియా ఆడుతున్నప్పుడు మరో టీంను శ్రీలంకకు పంపాలని భావించినప్పటి నుండి సమస్య మొదలైంది. ఈ ఏడాది కూడా ఆ మధ్య ఐర్లాండ్‌లో ఒక టీం, ఇంగ్లండ్‌లో మరో టీం ఉంది. ఇక ఇప్పుడు ఒక టీమ్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాలి, మరో టీం టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. ఒక నేషనల్ టీమ్ ఒకేసారి రెండేసి సిరీస్‌లు ఆడగలిగేంత మంది ప్లేయర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. నిజానికి ఇప్పుడు వన్డే సిరీస్‌లో చోటు ఆశించి అసంతృప్తికి గురైన వాళ్లు కూడా ఉన్నారు.
ఇప్పుడు టీంను ఎంపిక చేయడం సెలక్టర్లకు పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఉన్న ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే అంటున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రతిభావంతులను చూస్తుంటే.. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌కు టీమ్ ఎంపిక సెలక్టర్లకు పెద్ద సవాలే అంటున్నారు.
“మనకు మంచి ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు. వాళ్లంతా సిరీస్ కోసం ఆసక్తిగల వారు. వాళ్ల మధ్య పోటీ మంచిదే. మనకు అందుబాటులో ఉన్న టాలెంట్‌ను చూస్తే ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాని స్థితి. 2023 వన్డే వరల్డ్‌కప్ కోసం తగిన టీంను ఎంపిక చేయడం సెలక్టర్లకు కష్టమే” అని లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నాడు.
“యువకులంతా బాగా ఆడుతున్నారు. ఒకసారి ప్రధాన ప్లేయర్స్ వస్తే తమకు అవకాశాలు తగ్గుతాయని వాళ్లకు తెలుసు. కానీ ఓ బలమైన టీమ్‌ను ఎంపిక చేసినప్పుడు సెలక్టర్ల దృష్టిలో ఉండటానికి ఇప్పుడు బాగా ఆడటం ముఖ్యం” అని లక్ష్మణ్ చెప్పాడు. సహజంగా ఇండియన్ టీమ్‌లో ఉండే స్టార్ ప్లేయర్స్ ఎవరూ లేకపోయినా కూడా తొలి వన్డేలో సౌతాఫ్రికాను బాగా ఎదుర్కొంది యంగిండియా.
Indian Cricket:
ముఖ్యంగా సంజూ శాంసన్ కేవలం 63 బాల్స్‌లోనే 86 రన్స్ చేసి టీమిండియాను విజయపథంలో నడిపాడు. తొలి వన్డేలో ఓడినా టీమ్ పోరాటం సూపర్బ్. మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం (అక్టోబర్ 9) జరగనుంది