Indian Cricket Team : ఇండియా – పాకిస్తాన్ మధ్య క్రికెట్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు మైదానం బయట, మైదానం లోపల క్రికెట్ అభిమానులు, క్రికెటర్ల మధ్య క్రికెట్ కు సంబంధించి ఒకలాంటి ఘర్షణ వాతావరణం ఎప్పుడూ ఉంటుండడంతో ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ అంటే ఎనలేని క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఇక ప్రపంచంలో అత్యధికంగా క్రికెట్ అభిమానులు ఎక్కువగా తిలకించేది ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచులనే..!
తాజాగా ఆసియా కప్ 2023కు పాకిస్తాన్ అతిథ్యం ఇవ్వనుంది. దీంతో టీమిండియా పాకిస్తాన్ లో 15 ఏళ్ల తర్వాత పర్యటించే అవకాశం ఉండనుంది. దీనిపై బీసీసీఐ బోర్డు పెద్దలు సూచనప్రాయంగా అంగీకారాన్ని తెలిపారని సమాచారం. అక్టోబర్ 18న ముంబైలో జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)లో ఆసియా కప్ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
కొన్నేళ్ల నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక టీములు పాకిస్థాన్‌లో పర్యటించాయి. ఈ మధ్యనే ఇంగ్లాండ్ టీం పాకిస్థాన్లో 7 T20లతో కూడిన సిరీస్ ఆడడానికి పాకిస్తాన్ కు వెళ్ళింది. రాజకీయంగా ఇండియాకు పాకిస్తాన్ కు వైరం ఉన్నందున మనం పాకిస్తాన్లో పర్యటించాలి అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి.
Indian Cricket Team :
చివరిగా టీమిండియా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. దాని తర్వాత ఇప్పటివరకు ఒక్క సిరీస్ లో కూడా ఇండియా పాకిస్తాన్లో పర్యటించలేదు. తటస్థ వేదికలలో ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇండియా – పాకిస్తాన్ తలపడింది. ఇక చివరిగా పాకిస్తాన్ 2010లో ఇండియాలో అడుగుపెట్టింది. ఏది ఏమైనాప్పటికీ పాకిస్తాన్ – ఇండియా మ్యాచ్లు అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సగటు క్రికెట్ అభిమానిగా రెండు దేశాల మధ్య ఎక్కువ క్రికెట్ మ్యాచులు ఉండాలని ఆశిద్దాం.